యాప్నగరం

4 పెళ్లిళ్లు... 40 మంది పిల్లలు... 3 తలాక్‌లు

వివాదాస్పద కామెంట్లు చేసే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మళ్లీ తన నోటికి పనిచెప్పారు.

TNN 7 Jan 2017, 6:31 pm
వివాదాస్పద కామెంట్లు చేసే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మళ్లీ తన నోటికి పనిచెప్పారు. గతంలో ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనమంటూ వ్యాఖ్యలు చేసి చీవాట్లు తిన్నారు. ప్రధాని మోడీ సూచనతో కొన్నాళ్ల పాటూ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ రెచ్చి పోయి ఓ మత వర్గీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యూపీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నలుగురిని పెళ్లి చేసుకోవడం, 40 మంది పిల్లల్ని కని దేశ జనాభాను విపరీతంగా పెంచేస్తున్నారని, అందుకు ఓ మత వర్గీయులు కారణమని అన్నారు. దీనిపై దుమారం చెలరేగడంతో తన వ్యాఖ్యలపై శనివారం వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. మహిళలేమీ పిల్లల్ని కనే మెషీన్లు కారని అన్నారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని 40 మంది పిల్లల్ని కని, మూడు సార్లు విడాకులు తీసుకోవడమనేది సహించే పరిణామాలు కావని తన ఉద్దేశమని తెలిపారు.
Samayam Telugu four wives 40 children 3 divorces are unacceptable says bjp leader sakshi maharaj
4 పెళ్లిళ్లు... 40 మంది పిల్లలు... 3 తలాక్‌లు


హిందువులు దేశ జనాభా పెరగడానికి కారణం కాదని తెలిపారు. అయితే హిందువుల జనాభా తగ్గిపోయి, మరో మతం జనాభా పెరిగితే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని, దేశం ముక్కలు గా విడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశజనాభా మాత్రమే పెరుగు తుందని, దేశ విస్తీర్ణం మాత్రమే అలాగే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తనతో పాటూ తన నలుగురు అన్నదమ్ములు సన్యాసం పుచ్చుకున్నామని, పెళ్లి, పిల్లలు తమ జీవితంలో లేవని అన్నారు. కనుక తప్పకుండా తమకు అవార్డు ఇవ్వాలని అన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాక్షి మహరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.