యాప్నగరం

Free Ration దేశంలోని 81 కోట్ల మంది పేదలకు లబ్ది కలిగే కీలక నిర్ణయం తీసుకున్న మోదీ

Free Ration ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో 2023 డిసెంబర్ వరకు ఉచితరేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల వరకు అందజేయనున్నారు. 2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది .తర్వాత దీనిని క్రమంగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరో ఏడాదికి ఉచిత బియ్యం పథకాన్ని పొడిగించింది

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 24 Dec 2022, 7:26 am

ప్రధానాంశాలు:

  • జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచిత రేషన్
  • 2023 డిసెంబరు వరకూ కొనసాగించాలని నిర్ణయం
  • పూర్తిగా భారాన్ని భరించనున్న కేంద్ర ప్రభుత్వం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Food Security Scheme
Free Ration దేశంలోని కోట్లాది మంది పేదలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFCA)కిందకు పేదలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార పదార్థాలను అందజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీని వల్ల 81.35 కోట్ల మంది పేదలకు లబ్ది కలగనుండగా.. మొత్తం రూ.2 లక్షల కోట్ల ఖర్చవుతుందని అంచనా. ఇప్పటి వరకు ఎన్‌ఎఫ్‌సీఏ పథకంలో భాగంగా రాయితీ ధరలకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన(పీఎంజీకేఏవై) కింద ఉచితంగా బియ్యం, గోధుమలు అందజేస్తోంది. అయితే, ఇకపై ఆ రెండు పథకాలను విలీనం కేంద్రం విలీనం చేసి.. అంత్యోదయ అన్నయోజన కిందికి వచ్చే కుటుంబాలకు నెలకు 35 కిలోలు, మిగతా వారికి నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా అహార ధాన్యాలను అందజేస్తారు.
ఈ పథకానికయ్యే రూ.2 లక్షల కోట్ల ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించాలని తీర్మానించినట్లు ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. ‘‘జాతీయ ఆహార భద్రత చట్టం కింద పంపిణీ చేసే బియ్యానికి కిలోకు రూ.3, గోధుమలకు రూ.2, చిరుధాన్యాలకు రూ.1 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వాటిని చేయకుండా ఆహారధాన్యాలను పేదలకు పూర్తి ఉచితంగా అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 81.35 కోట్ల మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుంది.

ఇప్పటి వరకు రాయితీ ధరల్లో ఆహార ధాన్యాలను కొనుగోలుచేసే వారికి ఇకపై పూర్తిగా ఉచితంగా అందుతాయి. అంత్యోదయ అన్నయోజన కింద 35 కిలోల లభించేవారికి ఇప్పుడు కూడా అంతే అందుతుంది.. మిగిలినవారికి తలసరి 5 కిలోల చొప్పున లభిస్తాయి. 2023 డిసెంబరు వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది’’ అని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

కోవిడ్ కారణంగా పేదల ఇబ్బందులు ఎదుర్కొవడంతో పీఎంజీకేఏవై కింద తిండిగింజలు ఉచితంగా అందించేవారని, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ వారికి ఉపశమనం కలిగించేలా ఆహారభద్రత చట్టం కింద సబ్సిడీ ధరల్లో ఇచ్చే ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన అందులోకే విలీనం అవుతుందని వివరించారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 2020 నుంచి పేదలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందజేస్తోన్న విషయం తెలిసిందే.

జాతీయ ఆహార భద్రతా చట్టం, దానికి సంబంధించిన ఇతర సంక్షేమ పథకాలతో పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అదనపు కేటాయింపుల అసరాలను తీర్చడానికి దేశంలో తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గత వారం తెలిపింది.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.