యాప్నగరం

​ఆయన సీఎం కావడం ఖాయం: గాలి జనార్ధన్ రెడ్డి

వందల కోట్ల రూపాయల విలువైన గాలి కుటుంబ ఆస్తులపై ఈడీ అటాచ్ మెంట్ కూడా తొలగింది

TNN 2 Jun 2017, 10:47 am
కర్ణాటక ముఖ్యమంత్రిగా తిరిగి యడ్యూరప్ప ఎన్నిక కావడం ఖాయం.. అని అంటున్నారు ఆ రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి. అక్రమ మైనింగ్ కేసుల్లో అరెస్టై, కొన్నాళ్ల కిందట విడుదల అయిన జనార్ధన్ రెడ్డి తిరిగి రాజకీయంగా క్రియాశీలం అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వందల కోట్ల రూపాయల విలువైన గాలి కుటుంబ ఆస్తులపై ఈడీ అటాచ్ మెంట్ కూడా తొలగింది. ఆ ఆస్తులను జనార్ధన్ రెడ్డి కుటుంబానికి అప్పగించింది కోర్టు. దీంతో కర్ణాటకలో తిరిగి గాలి హవా మొదలైందనే మాట వినిపిస్తోంది.
Samayam Telugu gali janardhan reddy supports yeddyurappa
​ఆయన సీఎం కావడం ఖాయం: గాలి జనార్ధన్ రెడ్డి


ఈ నేపథ్యంలో యడ్యూరప్పను తిరిగి సీఎంగా చేసేంత వరకూ విశ్రమించను.. అని జనార్ధన్ రెడ్డి అంటున్నారు. యడ్యూరప్పను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడటం తన కల అని, అది వచ్చే ఎన్నికలతో నెరవేరుతుందని అన్నారు.

పార్టీ తరపున ఏ బాధ్యతను అప్పగించినా స్వీకరిస్తానని ప్రకటించారు. గతంలో యడ్యూరప్ప ప్రభుత్వంలో జనార్ధన్ రెడ్డి పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రిగా ఉండేవారు. ఎమ్మెల్సీ హోదాలో అప్పట్లో మంత్రిగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో ఈయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.