యాప్నగరం

గౌరీ లంకేశ్ హత్య కేసులో జర్నలిస్ట్‌పై విచారణ

ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ హత్య కేసు‌ విచారణని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేగవంతం

TNN 30 Sep 2017, 3:41 pm
ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ హత్య కేసు‌ విచారణని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేగవంతం చేసింది. విచారణలో భాగంగా గతంలో ఆమెతో విభేదాలు ఉన్న వారి‌ని ఎంక్వైరీ చేస్తున్న సిట్.. తాజాగా డైరెక్టర్, జర్నలిస్ట్ అయిన చక్రవర్తి చంద్రచూడ‌‌‌‌ని పిలిపించి మాట్లాడింది. గౌరీ లంకేశ్ ఎడిటర్‌గా పనిచేసిన కన్నడ పత్రిక ‘గౌరీ లంకేశ్‌ పత్రికె’‌లో చక్రవర్తి వ్యవహారశైలిపై అప్పట్లో ఓ వివాదాస్పద కథనం ప్రచురితమైంది.
Samayam Telugu gauri lankesh murder journalist chakravarty chandrachuda enquired
గౌరీ లంకేశ్ హత్య కేసులో జర్నలిస్ట్‌పై విచారణ


ఈ కథనంపై చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికతో పాటు రిపోర్టర్‌పై కూడా కేసు పెట్టారు. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ గౌరీ లంకేశ్ తీరుపై ఘాటు‌గా విమర్శలు గుప్పించారు. ఈ మొత్తం వివాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సిట్ తాజాగా చక్రవర్తి‌‌‌ని పిలిపించి.. గౌరీ లంకేశ్ సోదరుడు, చిత్ర నిర్మాత ఇంద్రజిత్‌తో ఉన్న సంబంధాలు, గౌరీ లంకేశ్‌తో విభేదాలపై పలు రకాల ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ‘అవును.. మేము చక్రవర్తిని విచారించి కొంత సమాచారాన్ని సేకరించాం. అవసరమైనప్పుడు మళ్లీ అతడ్ని పిలుస్తాం’ అని సిట్ అధికారి ఒకరు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.