యాప్నగరం

ఆ జర్నలిస్ట్ కళ్లతో మరొకరి జీవితంలో వెలుగులు

బెంగళూరు దారుణ హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ కోరిక మేరకు ఆమె కళ్లను దానం చేశారు..

TNN 7 Sep 2017, 4:50 pm
బెంగళూరుకు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. రాజరాజేశ్వరి నగర్‌లోని గౌరీ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ఆమెను దారుణంగా కాల్చి చంపారు. బుధవారం ఆమె పార్థీవ దేహానికి అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హిందూత్వ వాదానికి వ్యతిరేకంగా గళం వినిపించడం వల్లే గౌరీని హత్య చేశారని బీజేపీయేతర రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.
Samayam Telugu gauri lankeshs eyes donated as per her wishes
ఆ జర్నలిస్ట్ కళ్లతో మరొకరి జీవితంలో వెలుగులు



ఆమె మన మధ్య భౌతికంగా లేకపోయినా.. తన కోరిక మేరకు నేత్రాలను దానం చేసినట్లు గౌరీ సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్ మీడియాకు తెలిపారు. లంకేశ్ పత్రికే పేరిట ఆమె ఓ కన్నడ టాబ్లాయిడ్‌ను నడుపుతున్నారు. బీజేపీ నాయకులు పరువు నష్టం కేసు నమోదు చేయడంతో నవంబర్ 2016లో కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కర్ణాటకలోని మావోయిస్టు సంబంధిత వార్తలు, ఇతర సామాజిక అంశాలపై చురుకుగా పనిచేసిన పాత్రికేయురాలిగా గౌరీ లంకేశ్‌కి పేరుంది.

గౌరీని దుండగులు దారుణంగా హతమార్చారు. కానీ ఆమె మరణిస్తూ కూడా నేత్రదానం ద్వారా వేరే వ్యక్తుల జీవితాల్లో వెలుగు నింపిందని ఆమెను అభిమానించేవారు గర్వంగా చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.