యాప్నగరం

దెయ్యాల గ్రామాల్లో క్వారంటైన్ సెంటర్లు.. ఉత్తరాఖండ్‌లో హాట్ టాపిక్!

Ghost Villages: సరైన వసతులు, ఉద్యోగ అవకాశాలు లేక ఉత్తారఖండ్‌లోని పౌడి జిల్లాలో చాలా గ్రామాల్లో జనం ఇళ్లను ఖాళీ చేసి వలస వెళ్లిపోయారు. దశాబ్దాలుగా ఆ ఇళ్లు తాళాలు వేసి ఉండటంతో పాడుబడ్డాయి. ఇప్పుడు ఆ ఇళ్లలోకి అనుకోని అతిథులు చేరుతుండటం హాట్ టాపిక్ అయ్యింది.

Samayam Telugu 15 May 2020, 11:39 pm
రోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌‌తో దేశంలోని పలు నగరాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డ వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఊరట కలిగింది. శ్రామిక్ రైళ్ల ఏర్పాటుతో వీరంతా స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. అయితే.. ఇలా స్వస్థలాలకు వస్తున్న కార్మికులను క్వారంటైన్ చేయాలని కేంద్రం నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. లక్షలాదిగా తరలి వస్తున్న వలస కార్మికులకు క్వారంటైన్‌ ఏర్పాటు చేయడం కొన్ని రాష్ట్రాలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాడుబడిన ‘దెయ్యాల గ్రామాల’ను క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తోంది. ఈ దెయ్యాల గ్రామాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Samayam Telugu దెయ్యాల గ్రామాలు (Photo Credit: The Citizen)
Uttarakhand Villages


ఉత్తరాఖండ్‌లోని పౌడి జిల్లాలోని చాలా గ్రామాల్లో సరైన వసతులు లేక చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి పట్టణాలకు వెళ్లిపోయారు. మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో స్థానికులు వలస వెళ్లడంతో ఏళ్ల తరబడి ఇక్కడ ఇళ్లన్నీ ఖాళీగా మారాయి. ఆయా గ్రామాల్లో ఇళ్లన్నీ తాళం వేసి కనిపిస్తాయి. నిర్జనంగా మారిపోయిన పాడుబడిన ఇళ్లతో కూడిన ఈ గ్రామాలను ‘దెయ్యాల గ్రామాలు’గా పిలుస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని దశాబ్దాల తర్వాత గ్రామస్థులు తిరిగి వస్తుండటం గమనార్హం.

Must Read: మా పేషెంట్ పరిస్థితి ఏంటి.. అంత్యక్రియలు పూర్తి చేశాం, షాకింగ్ ఆన్సర్!

ప్రస్తుతం వలస కార్మికులను క్వారంటైన్‌ చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ గృహాలను వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి చర్యలు ప్రారంభించింది. ‘దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే ఈ నిర్జన గ్రామాల్లోని ఇళ్లను వాడుకోవడం అత్యవసరం’ అని పౌడి జిల్లా అధికారి పేర్కొన్నారు.

పౌడి జిల్లాలో అత్యధికంగా 186 నిర్జన గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఇళ్లను శుభ్రం చేయించి సదుపాయాలు కల్పించారు. 576 మందిని క్వారంటైన్‌ చేశారు. సాధారణంగా వలస కార్మికులను క్వారంటైన్‌ చేసేందుకు పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ అధీనంలోని ఇతర భవనాలను ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇవన్నీ ఊరి మధ్యలో ఉండటంతో అక్కడి ప్రజలకు వైరస్‌ ముప్పు పొంచి ఉంటోంది. గ్రామస్థులు కూడా తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Photo Credit: The Citizen

Also Read: భారత చెఫ్‌ను ప్రేమపెళ్లి చేసుకున్న ఆ యువరాణి మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.