యాప్నగరం

15 ఏళ్లకే అమ్మాయిలు పిల్లల్ని కనేస్తున్నారు.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

అమ్మాయిల పెళ్లి వయసుపై సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 15 ఏళ్లకే బాలికలు పిల్లల్ని కనడానికి రెడీగా ఉన్నారంటూ సజ్జన్ సింగ్ వర్మ కాంట్రోవర్సీ కామెంట్లు చేశారు.

Samayam Telugu 14 Jan 2021, 6:24 pm
అమ్మాయిలపై మరో నాయకుడు నోరు పారేసుకున్నారు. మహిళలపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ హాట్‌టాపిక్‌గా నిలిచారు.
Samayam Telugu అమ్మాయిలపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
pregnant

ఆడవారు 15 ఏళ్లకే పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ నేత సజ్జన్ సింగ్ వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయ్యింది. సజ్జన్ సింగ్‌కు నోటీసులు పంపింది. మైనర్ బాలికలపై ఆ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారని కమిషన్ ప్రశ్నించింది. ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యాన్ని వివరించాలని వర్మకు జారీ చేసిన నోటీసులో కమిషన్ పేర్కొంది.

ఇటీవల మహిళల పెళ్లి వయస్సుపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు చేశారు. ఆడామగ మధ్య పెళ్లి విషయంలో వయోబేధాలు ఉన్నాయన్న ఆయన.. మహిళలకు ఎందుకు 18 ఏళ్లకే పెళ్లి వయసు ఉండాలని ప్రశ్నించారు. మగవారికి 21 ఏళ్ల వయసు ఉన్నట్లే ఆడవారి విషయంలో కూడా వయసును 21కి సవరించాలన్నారు శివరాజ్ సింగ్. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ డాక్టర్లు చెప్పిన ప్రకారమే, అమ్మాయిలు 15 ఏళ్ల వయసుకే పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటారన్నారు.

Read More: ఐదుగురుకు ప్రాణం పోసిన చిన్నారి.. తాను చనిపోయిన కూడా

ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ ఏమైనా డాక్టరా? ఆయన ఏ ప్రాతిపదికపైన పెళ్లికి మహిళల వయసు పెంచాలని అనుకుంటున్నారు?'' అని సజ్జన్ సింగ్ వర్మ ప్రశ్నించారు. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది మండిపడుతున్నారు. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా స్పందించి వెంటనే ఆయనకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపింది. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత భూపెంద్ర గుప్త వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వర్మ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.