యాప్నగరం

పెళ్లికి నిరాకరించిందని యువతి హత్య

పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో 18 ఏళ్ల యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ క్రూరంగా హత్యచేసిన ఘటన రాజస్థాన్‌లో శనివారం

TNN 9 Dec 2017, 9:11 pm
పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో 18 ఏళ్ల యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ క్రూరంగా హత్యచేసిన ఘటన రాజస్థాన్‌లో శనివారం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కోట ప్రాంతానికి చెందిన యువతి సోదరితో కలిసి కోచింగ్ క్లాస్‌కి వెళ్తుండగా కత్తితో దాడి చేసిన యువకుడు ఆమె శరీరంపై ఆరు చోట్ల విచక్షణారహితంగా పొడవగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి యువతి మృతి చెందినట్లు ఎస్‌ఐ భీమ్‌సింగ్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu girl stabbed to death by lover in rajasthans kota for refusing to marry him
పెళ్లికి నిరాకరించిందని యువతి హత్య


కోట్ల ప్రాంతంలోని బోర్‌ఖేదాకి చెందిన షబ్బీర్, షహనూర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని తొలుత నిర్ణయించుకున్నా.. షబ్బీర్ వ్యవహారతీరు సరిగా లేకపోవడంతో క్రమంగా షహనూర్ దూరంగా ఉంటూ వచ్చింది. దీన్ని గమనించిన షబ్బీర్ తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచడంతో విసిగిపోయిన షహనూర్ కుదరదని తేల్చిచెప్పేసింది. దీంతో కోపం తెచ్చుకున్న షబ్బీర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో షహనూర్ శరీరంపై విచరక్షణారహితంగా పొడిచేశాడు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. రక్తపుమడుగులో పడి ఉన్న యువతిని ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.