యాప్నగరం

బార్ డాన్సులకు సుప్రీం అనుమతి

బార్ లలో డాన్సులు వేసేందుకు అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

TNN 2 Mar 2016, 2:10 pm
ఢిల్లీ: బార్ లలో డాన్సులు వేసేందుకు అనుమతి ఇస్తూ బుధవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బార్ యాజమాన్యాలకు మార్చి 15లోగా అనుమతి ఇస్తూ లైసెన్సులు జారీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. అవసరమనుకుంటే సిసి కెమెరాలతో నిఘా ఉంచాలే కానీ ఇలా నిషేదం విధించడం సరికాదని అభిప్రాయపడింది.
Samayam Telugu give licences to dance bars by march 15 sc
బార్ డాన్సులకు సుప్రీం అనుమతి


బార్ లలో డాన్సులకు అనుమతి ఇవ్వడమంటే వ్యభిచారన్ని పరోక్షంగా ప్రొత్సహించినట్లేనని వాదిస్తూ క్లబ్ డాన్సులపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేదం విధించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్లబ్ డాన్సర్ల అసోసియేషన్ సభ్యుడు అత్యున్నత థర్మాసనాన్ని ఆశ్రయించాడు. డాన్సులను నిషేదించడమంటే వ్యక్తిగత స్వేచ్చను హరించినట్లేనని.. మహారాష్ట్ర ప్రభుత్వం తీరు ఇదే తరహాలో ఉందని పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు క్లబ్ డాన్సర్లకు అనుకూలంగా తీర్పు వెలువరిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.