యాప్నగరం

బీజేపీకి షాక్: గోవా సీఎం ఓటమి

గోవాలో బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది.

TNN 11 Mar 2017, 10:04 am
గోవాలో బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది. ఈ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారానికి కేంద్ర రక్షణ మంత్రి, మాజీ గోవా సీఎం అయిన మనోహర్ పారికర్‌ను రంగంలోకి దింపినప్పటికీ... అక్కడ ఫలితాలు చేదుగానే వస్తున్నాయి ఆ పార్టీకి. గోవా సీఎం లక్ష్మీకాంత్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘునాథ్ దయానంద్ అతనిపై విజయం సాధించారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ప్రస్తుతం బీజేపీ 5 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచి, మరో 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి పోటాపోటీగా కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. బీజేపీకి వీస్తున్న ఎదురుగాలే ఇందుకు నిదర్శనం.
Samayam Telugu goa cm laxmikant parsekar loses to congress dayanand sopte
బీజేపీకి షాక్: గోవా సీఎం ఓటమి


ఎన్నికల ప్రచారంలో బీజేపీ గోవా సీఎం అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించలేదు. కాస్త ఎదురుగాలి వీస్తున్నట్టు బీజేపీ అధిష్టానం ముందే ఊహించినట్టు కనిపిస్తోంది. ఒకవేళ గోవాలో బీజేపీ గెలిస్తే.. ఇప్పటి సీఎం లక్ష్మికాంత్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసే ఉద్దేశం కూడా అధిష్ఠానానికి లేదు. కేంద్ర రక్షణ మంత్రి, మాజీ గోవా సీఎం అయిన మనోహర్ పారికర్ నే మళ్లీ సీఎం చేయాలనుకుందని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.