యాప్నగరం

గోరఖ్‌పూర్‌‌ ఆసుపత్రిలో మరోమారు మృత్యుఘోష

గోరఖ్‌పూర్‌‌లోని బాబా రాఘవ్‌ దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో మృత్యువు విలయతాండవం చేస్తోంది. ఆగస్టులో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిన కారణంగా 63 మంది చిన్నారులు మరణించిన విషయం మరవకముందే మరోసారి ఆ తరహా ఉదంతం పునరావృమైంది. గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో 75 మంది చిన్నారులు మృతి చెందారు..

TNN 13 Oct 2017, 10:14 pm
గోరఖ్‌పూర్‌‌లోని బాబా రాఘవ్‌ దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో మృత్యువు విలయతాండవం చేస్తోంది. ఆగస్టులో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిన కారణంగా 63 మంది చిన్నారులు మరణించిన విషయం మరవకముందే మరోసారి ఆ తరహా ఉదంతం పునరావృమైంది. గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో 75 మంది చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల వరస మరణాలతో ఉత్తరప్రదేశ్‌ అట్టుడుకిపోయిన విషయం తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 5 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో మృత్యు పరంపర కొనసాగుతుండటంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Samayam Telugu gorakhpur tragedy repeats 69 children dead in 4 days at brd medical college
గోరఖ్‌పూర్‌‌ ఆసుపత్రిలో మరోమారు మృత్యుఘోష


‘యూపీ సీఎం సిగ్గుతో తల దించుకోవాల్సిన ఉదంతమిది. ఆయనకేమైనా మానవత్వ విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవాలి’ అని బీఎస్పీ నేతలు మండిపడుతున్నారు. బాబా రాఘవ్‌ దాస్‌ మెడికల్‌ కాలేజీ అనేది గోరఖ్‌పూర్‌లో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి. గోరఖ్‌పూర్‌తో పాటు పరిసర జిల్లాలకు చెందిన పేదలంతా వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.