యాప్నగరం

డార్జిలింగ్‌కు అదనపు బలగాలు..

ప్రత్యేక గూర్ఖాలాండ్‌ ఏర్పాటు కోరుతూ చేస్తున్న ఉద్యమంతో పశ్చిమ బెంగాలోని డార్జిలింగ్‌ రోజు రోజుకీ అట్టుడికిపోతోంది. నెలరోజులు గడుస్తున్నా..

TNN 14 Jul 2017, 9:21 pm
ప్రత్యేక గూర్ఖాలాండ్‌ ఏర్పాటు కోరుతూ చేస్తున్న ఉద్యమంతో పశ్చిమ బెంగాలోని డార్జిలింగ్‌ రోజు రోజుకీ అట్టుడికిపోతోంది. నెలరోజులు గడుస్తున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కలకత్తా హైకోర్టు స్పందించింది. డార్జిలింగ్‌కు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. 48 గంటల్లోగా మరిన్ని పారా మిలిటరీ బృందాలను పంపాలని కేంద్రానికి సూచించింది. కోర్టు ఆదేశాలకు స్పందించిన కేంద్రం.. వెంటనే డార్జిలింగ్, కలింపాంగ్‌కు మరిన్ని బలగాలను పంపించింది.
Samayam Telugu gorkhaland protest centre sending additional troopsto darjeeling
డార్జిలింగ్‌కు అదనపు బలగాలు..


గూర్ఖాలాండ్‌‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల రోజులుగా ఈ ఆద్యమం మరింత తీవ్రమైంది. డార్జిలింగ్‌లో నిరవధిక బంద్‌ పాటిస్తున్న నిరసనకారులు.. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లకు నిప్పు పెట్టారు. పలు ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు.

వందల సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. బంద్‌ నేపథ్యంలో విద్యా, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు, హోటళ్లు మూతబడ్డాయి. మరోవైపు ఆందోళనకారులను అడ్డుకోడానికి పోలీసులు, సైనికులు, పారామిలిటరీ బలగాలు వీధుల్లో గస్తీ నిర్వహిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.