యాప్నగరం

సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డు తప్పనిసరికాదు

'ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వాలు విధిస్తోన్న నిబంధనలపై సుప్రీం..

TNN 27 Mar 2017, 1:51 pm
'ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డుని తప్పనిసరి నిబంధన చేయరాదు' అని సుప్రీం కోర్టు స్పష్టంచేసినట్టుగా పీటీఐ పేర్కొంది. అయితే, అదే సమయంలో బ్యాంక్ ఎకౌంట్స్‌కి ఆధార్ కార్డు అవసరం అనేటటువంటి నిబంధనల విషయంలో ఎటువంటి మార్పు వుండబోదని సుప్రీం తేల్చిచెప్పింది. ఆధార్ ని సవాలు చేస్తూ దాఖలయ్యే విజ్ఞప్తులపై విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా ఓ ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందన్న కోర్టు... ప్రస్తుతానికి అది సాధ్యపడదు అని అభిప్రాయపడింది.
Samayam Telugu government cant make aadhaar card mandatory for its welfare schemes sc
సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డు తప్పనిసరికాదు


ఈ నెల మొదట్లోనే ఆధార్ వివాదంపై వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఆధార్ నెంబర్ లేదనే కారణంతో సంక్షేమ పథకాలు అందించకుండా ఏ ఒక్క లబ్ధిదారులనీ అనర్హులుగా పక్కకు పెట్టడంలేదని తెలిపింది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ లేనిపక్షంలో, వారికి ఆధార్ నెంబర్ కేటాయించేంతవరకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలని సూచిస్తున్నట్టు కేంద్రం తన వివరణలో పేర్కొంది. అంతేకాకుండా ప్రతీ ఒక్కరికీ ఆధార్ నెంబర్ కేటాయించేందుకు వీలుగా ఆధార్ జారీ కేంద్రాలని ఏర్పాటు చేయాలని కేంద్రం సంబంధిత శాఖలకి ఆదేశాలు జారీచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.