యాప్నగరం

కేంద్రానికి ఇగో లేదు.. చర్చలు కొలిక్కి రాలేదు: వ్యవసాయ మంత్రి

Narendra Singh Tomar: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు స్పష్టం చేశారు. కేంద్రానికి ఇది చివరి అవకాశం అని వారు స్పష్టం చేశారు.

Samayam Telugu 3 Dec 2020, 9:52 pm
రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. దీంతో శనివారం (డిసెంబర్ 5) మరోసారి చర్చలకు రావాలని రైతు సంఘాల ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. రైతులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని.. ప్రభుత్వానికి ఎలాంటి ఇగో లేదని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. మరోసారి చర్చించి పరిష్కార మార్గాలను కనుగొంటామని తెలిపారు.
Samayam Telugu రైతుల ఆందోళన
Farmers protest


కేంద్ర మంత్రుల బృందం వరుసగా రెండో రోజైన గురువారం (డిసెంబర్ 3) ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో రైతు సంఘాలతో భేటీ అయింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన చర్చలు సుమారు 7 గంటలపాటు కొనసాగాయి. అయినా.. ఓ కొలిక్కి రాలేదు.

చట్టాల్లో కొన్ని సవరణలు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చినా.. రైతు సంఘాలు తిరస్కరించాయి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. మరోవైపు.. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. రైతు సంఘాల ప్రతినిధులు గతంలో జరిగిన సమావేశంలో, నేటి చర్చల్లో పలు అంశాలు లేవనెత్తారని తెలిపారు.

తమ డిమాండ్లపై తుది నిర్ణయం చెప్పేందుకు కేంద్రం ఎల్లుండి వరకు గడువు కోరిందని రైతు నాయకులు తెలిపారు. సింఘూ సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశమై చర్చలకు హాజరు కావాలా, వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Also Read: వంట గ్యాస్‌ ధర భారీగా పెంపు.. సామాన్యులకు షాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.