యాప్నగరం

పెళ్లికోసం బలవంతపు మత మార్పిడి నేరం.. అమల్లోకి యూపీ లవ్ జిహాద్ చట్టం

బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మతం మారాలనుకుంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలి.

Samayam Telugu 28 Nov 2020, 4:41 pm
దేశవ్యాప్తంగా లవ్ జిహాద్, మతాంతర వివాహాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ పెళ్లి కోసం చట్టవిరుద్ధంగా మత మార్పిడులకు పాల్పడే వారిపై కొరడా ఝళిపిస్తూ యూపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘మత మార్పిడుల వ్యతిరేక బిల్లు 2020’పేరుతో యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ శనివారం ఆమోదం తెలపడంతో చట్టం అమల్లోకి వచ్చింది. బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు.
Samayam Telugu లవ్ జిహాద్ చట్టం


ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇకపై ఎవరైనా పెళ్లి కోసం మతం మారాలనుకుంటే జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి 2 నెలల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం చట్టవిరుద్ధంగా బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి 1 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.15 వేల జరిమానా విధిస్తారు. ఒకవేళ మైనర్లు, దళిత, గిరిజన యువతులను, మహిళలను బలవంతంగా మతమార్పిడికి గురిచేస్తే 3 నుంచి పదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.50 వేల జరిమానా విధిస్తారు.

ఆర్డినెన్స్‌ ద్వారా ఈ బిల్లును చట్టం రూపంలో అమల్లోకి తీసుకువచ్చారు. బలవంతంగా, మోసపూరితంగా మత మార్పిడి చేయడం లేదని నిరూపించాల్సిన బాధ్యత వివాహం చేసుకునే వ్యక్తులపై ఉంటుంది. మధ్యప్రదేశ్, అసోం లాంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా లవ్‌ జిహాద్‌, మతమార్పిడిలకు వ్యతిరేకంగా చట్టం రూపొందించే యోచనలో ఉన్నాయి. హర్యానా కూడా ఇలాంటి యోచనలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.