యాప్నగరం

నావికాదళానికి రూ.21 వేల కోట్లతో 111 హెలికాప్టర్లు

రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నావికా దళ అవసరాల కోసం రూ.21,000 విలువ చేసే 111 హెలికాప్టర్లను సమకూర్చేందుకు అనుమతి ఇచ్చింది.

Samayam Telugu 25 Aug 2018, 7:29 pm
క్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నావికా దళ అవసరాల కోసం రూ.21,000 విలువ చేసే 111 హెలికాప్టర్లను సమకూర్చేందుకు అనుమతి ఇచ్చింది. శనివారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్‌(DAC)లో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్య (SP) విధానంలో ఆరంభించే తొలి ప్రాజెక్ట్ కింద ఈ హెలికాప్టర్లు తయారు చేస్తారు.
Samayam Telugu afdf


యుద్ధాల్లో పోరాడేందుకు, సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు, నిఘా కోసం ఈ హెలికాప్టర్లను ఉపగిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనితో పాటు రూ.24,879.16 కోట్లు విలువ చేసే మరికొన్ని ప్రతిపాదనలకు కూడా డీఏసీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. వీటిలో రూ.3,364.78 కోట్లు విలువ చేసే 155 ఎం.ఎం. అడ్వాన్స్‌డ్ ఆర్టిలిటీ గన్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.