యాప్నగరం

మన డేటాను తస్కరిస్తోన్న చైనా ఫోన్ కంపెనీలు?

చైనా ఫోన్లు వాడుతున్నారా? ఏమో మన ఫోన్లలోని డేటాను తస్కరిస్తుండొచ్చు? కేంద్రం ఇదే తరహా అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది.

TNN 16 Aug 2017, 4:32 pm
మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు కస్టమర్ల నుంచి వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్ నంబర్లు, మెసేజ్‌లను తస్కరిస్తున్నాయా? కేంద్రం ఇదే తరహా అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. అందుకే వివో, ఒప్పో, షియోమో, జియోనీ లాంటి చైనాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థలతోపాటు మొత్తం 21 మొబైల్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఆపిల్, చైనా లాంటి బడా సంస్థలతోపాటు భారతీయ కంపెనీ అయిన మైక్రో‌మ్యాక్స్‌కు కూడా ప్రభుత్వం నోటీసులు పంపింది.
Samayam Telugu govt fears chinese phonemakers may be stealing info sends them notice
మన డేటాను తస్కరిస్తోన్న చైనా ఫోన్ కంపెనీలు?


భద్రతా నిబంధనలకు సంబంధించిన అంశాలను ఆగష్టు 28లోగా వెల్లడించాలని ఆ సంస్థలను ఆదేశించింది. ఈ విషయంలో ఆడిట్ కూడా జరుపుతామని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా డేటాను తస్కరిస్తున్నట్లు తేలితే మాత్రం పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది.

చైనా నుంచి ఎలక్ట్రానిక్, ఐటీ పరికరాలను భారీగా దిగుమతి చేసుకోవడాన్ని కూడా ప్రభుత్వం సమీక్షిస్తోంది. భద్రతాలోపం, సమాచార తస్కరణకు అవకాశం ఉండటం లాంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. చైనాతో డోక్లాం సరిహద్దు వివాదం నడుస్తోన్న నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్య ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.