యాప్నగరం

అరుణాచల్‌లో విదేశీ పర్యటకులకు అనుమతి!

అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలను త్వరలో విదేశీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. సురక్షిత ప్రాంత అనుమతి విధానంలో విదేశీ పర్యటకులను ఈ ప్రాంతాల సందర్శనకు అనుమతిస్తారు.

TNN 26 Mar 2018, 11:57 am
అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలను త్వరలో విదేశీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. సురక్షిత ప్రాంత అనుమతి విధానంలో విదేశీ పర్యటకులను ఈ ప్రాంతాల సందర్శనకు అనుమతిస్తారు. కేంద్రం సడలించిన నిబంధనలతో జమ్మూ కశ్మీర్లోని లడఖ్, సిక్కిమ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ కూడా మరింత లబ్ధి చేకూరుతుంది. పర్యటక శాఖపై వేసిన మంత్రుల సహకార కమిటీ సమావేశం తర్వాత కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. సురక్షిత ప్రాంత అనుమతి విధానంలో భాగంగా గతంలో అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు ఇచ్చిన రెండేళ్ల అనుమతికి బదులుగా, దీన్ని ఐదేళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అరుణాచల్‌లో ముఖ్యమైన ప్రాంతాలైన తవాంగ్ లోయ, జిరో, బొమిడిలాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగేలా కేంద్ర పర్యటక శాఖ చర్యలు చేపట్టింది.
Samayam Telugu అరుణాచల్ ప్రదేశ్


సున్నితమైన ప్రాంతాల్లో విదేశీ పర్యటకుల సందర్శనపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న కేంద్ర హోం శాఖ, సరిహద్దు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చే క్రమంలో నిబంధనలు సడలించింది. కేంద్ర హోం శాఖ నిర్ణయాన్ని పర్యటక శాఖ మంత్రి కేజే అల్ఫోన్స్ స్వాగతించారు. అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు పర్యటకులను అనుమతించాలని రెండేళ్ల కిందటే హోం శాఖకు లేఖ రాసామని, ప్రస్తుతం సడలించిన నిబంధనల వల్ల పర్యటక రంగానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి అల్ఫోన్స్ వ్యాఖ్యానించారు.

అరుణాచల్‌లో పర్యటకానికి మరింత ప్రాచుర్యం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని, బౌద్దంతో సంబంధం ఉన్న తవాంగ్ పర్యటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినా, తూర్పున దిబాంగ్ లోయలో పర్యావరణహిత పర్యటకాన్ని అన్వేషించే ప్రక్రియను కూడా చేపట్టామని పర్యటక శాఖ కార్యదర్శి రష్మీ వర్మ పేర్కొన్నారు. మరోవైపు అరుణాచల్‌లో షంగ్‌స్టర్ సరస్సు, తవాంగ్ లోయ లాంటి సుందర ప్రాంతాలు ఉన్నాయని తెలియజేస్తూ ఆ రాష్ట్ర సీఎం ఫెమా ఖండూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.