యాప్నగరం

రైతులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి ఖాతాల్లో డబ్బులు జమ

Farmers Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఎనిమిదో విడత డబ్బులు జమ చేయడానికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు.

Samayam Telugu 20 Mar 2021, 2:30 pm
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల ఖాతాల్లో మరో విడత డబ్బులు జమ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నగదును ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య దశల వారీగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు చేరని వారు మార్చి 31లోగా తమ పేరును పీఎం కిసాన్ స్కీమ్ అర్హుల జాబితాలో నమోదు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Farmers


రైతుల ఆర్థిక చేయూత అందించడానికి మోదీ సర్కార్ 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఏటా రైతుల ఖాతాలో 6 వేల రూపాయలను కేంద్రం జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా అందజేస్తున్నారు. ఒక్కో విడతలో రూ.2000 రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు.

ఈ పథకంలో భాగంగా మొదటి విడత డబ్బులను ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడు విడతల నగదును జమ చేసింది. తాజాగా ఎనిమిదో విడత డబ్బులు జమ చేయనున్నారు..

ఈ పథకంలో చేరని వారు మార్చి 31లోగా నమోదు చేసుకుంటే ఎనిమిదో విడత నగదు వారి ఖాతాల్లో పడతాయి. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ (pmkisan.gov.in) లో అర్హుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. బెనిఫీసియరీ లిస్టులో పేరు ఉందో, లేదో తెలుసుకోవడానికి ఇదే వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ లిస్టులో పేరున్నవారికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి.

Also Read:

వామ్మో! వీళ్ల టాలెంట్ మైండ్ బ్లోయింగ్.. ఇది షోరూమ్‌ ట్రక్ కాదు!

ఏడాదిలోగా టోల్‌ప్లాజాలన్నీ క్లోజ్.. వాహనదారులకు గుడ్ న్యూస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.