యాప్నగరం

నీళ్లబాటిల్ ధర పెంచి అమ్మితే జైలుకే!

నీళ్లబాటిల్, కూల్ డ్రింకులు ఎక్కువ ధరకు అమ్మితే జైలు కెళ్లాల్సిందే.

TNN 15 Oct 2016, 4:20 pm
లీటర్ నీళ్ల బాటిల్ పై ధర రూ.20 ఉంటుంది. థియేటర్లలో, రెస్టారెంట్లలో, ఎయిర్ పోర్టుల్లో మాత్రం రూ.25 నుంచి రూ.50వరకు అమ్ముతారు. ఇకపై అలా అమ్మితే అందుకు కారణమైన వారు భారీ జరిమానా కట్టడమో లేక జైలుకెళ్లడమో జరుగుతుంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎయిర్ పోర్టుల్లో కూడా ఎక్కువ ధరకు అమ్మితే శిక్ష పడుతుందని చెప్పారు. కొన్ని చోట్ల ఎమ్ఆర్ పీ కన్నా పది నుంచి 20 శాతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిపారు. శుక్రవారం 47వ వరల్డ్ స్టాండర్డ్స్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులు ఎక్కడ వాటర్ బాటిల్, కూలి డ్రింక్ కొన్నా కూడా రశీదు తీసుకోవాలని... అప్పుడే ఎక్కువ రేటుకు అమ్మితే కేసు పెట్టడానికి వీలవుతుందని చెప్పారు. అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వస్తేనే తాము ఏమైనా చేయగలమని, ప్రజలు ఫిర్యాదు చేయకుండా తమకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.
Samayam Telugu govt warns of action against sale of water bottle above mrp
నీళ్లబాటిల్ ధర పెంచి అమ్మితే జైలుకే!


జరిమానా ఎంత?

కూల్ డ్రింక్ లు, నీళ్ల బాటిళ్లను ఎమ్ఆర్‌పి కన్నా ఎక్కువ ధరకు అమ్మినట్టు రుజువైతే మొదటి సారి పాతికవేల రూపాయల జరిమానా పడుతుంది. రెండో సారి కూడా అలా అమ్మి పట్టుబడితే యాభైవేల రూపాయలు కట్టాలి. అలా వరుసగా పట్టుబడితే మాత్రం లక్ష రూపాయల వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిజానికి ఈ శిక్షలు 2009 నుంచే అమల్లో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.