యాప్నగరం

మోదీ నాలుగేళ్ల పాలనకు రాహుల్ రిపోర్ట్ కార్డ్

నరేంద్ర మోదీ సర్కారుకు రాహుల్ గాంధీ రిపోర్ట్ కార్డ్ రూపొందించారు. నాలుగేళ్లలో మోదీ సర్కారు ఏయే అంశాల్లో విఫలమైందో చెబుతూ ఆయన ట్వీట్ చేశారు.

Samayam Telugu 26 May 2018, 3:56 pm
మోదీ సర్కారు నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తామేం చేశామో బీజేపీ చెబుతుండగా.. ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకడుగు ముందుకేసి మోదీ ప్రభుత్వ నాలుగేళ్ల పనితీరుపై రిపోర్ట్ కార్డ్ తయారు చేశారు. వ్యవసాయం, విదేశాంగ విధానం, ఇంధన ధరలు, ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని రాహుల్ ఎద్దేవా చేశారు. వీటన్నింటిలో కేంద్రానికి ఆయన ఫెయిల్ మార్కులిచ్చారు.
Samayam Telugu rahul.


నినాదాల రూపకల్పన, సొంత డబ్బాలో మీ తర్వాతే ఎవరైనా అని అర్థం వచ్చేలా.. మాస్టర్ కమ్యూనికేటర్‌గా ఏ+ గ్రేడ్ ఇచ్చారు. యోగాకు ‘బీ-’ గ్రేడ్ ఇచ్చారు. మాటలు మాత్రమే బాగా చెబుతారని చెప్పడం కోసం మాస్టర్ కమ్యూనికేటర్ అనే రిమార్క్ ఇచ్చారు. సంక్లిష్ట సమస్యలతో సతమతం అవుతోందని, దేనిపైనా దృష్టి కేంద్రీకరించడం లేదని రాహుల్ కేంద్రాన్ని దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.