యాప్నగరం

ఇద్దరు పాకిస్థాన్ గుఢాచారుల అరెస్టు

ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు చేరవేస్తున్న ఇద్దరు గూఢాచారులను

Samayam Telugu 13 Oct 2016, 3:27 pm
ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు చేరవేస్తున్న ఇద్దరు గూఢాచారులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది.
Samayam Telugu gujarat ats nabs two suspects pak spies from kutch
ఇద్దరు పాకిస్థాన్ గుఢాచారుల అరెస్టు


ఈ ఇద్దరు గుఢాచారులు కచ్ జిల్లాలో అరెస్టయ్యారు. భారత్- పాకిస్థాన్ లు కచ్ లో సరిహద్దు ను పంచుకుంటున్నాయి.
‘ఇండియన్ ఆర్మీకి చెందిన కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్‌ ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేస్తున్నట్లు మాకు సమాచారం అందింది. ఈ ఇద్దర్నీ విచారించాక సమాచారం చేరవేస్తున్నది నిజమేనని తేలింది. ఇంకా విచారణ కొనసాగుతోంది. గుఢాచారుల నుంచి మొబైళ్లు స్వాధీనం చేసుకున్నాం’ అని గుజరాత్ ఏటీఎస్ డీఎస్పీ బిఎస్ చావ్దా తెలిపారు.

కచ్ జిల్లాలోని ఖవ్దా గ్రామానికి చెందిన వీరు పాకిస్థాన్ కు సమాచారం చేరవేస్తున్నారన్న అనుమానంపై సంవత్సరకాలంగా నిఘా ఉంచినట్లు ఏటీఎస్ అధికారులు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.