యాప్నగరం

కాజల్‌కి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం

ఓ నిరుపేద అథ్లెట్ ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్న ప్రభుత్వం ఆమెకి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చింది.

Samayam Telugu 6 Jun 2016, 4:51 pm
ఓ నిరుపేద అథ్లెట్ క్రీడా వికాసానికి పేదరికమే ఓ ప్రధాన ఆటంకంగా నిలిచిందని తెలుసుకున్న గుజరాత్ ప్రభుత్వం ఆమెకి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. గుజరాత్‌లోని పఠాన్ జిల్లాకి చెందిన కాజల్ పర్మర్ పేదరికం కారణంగా తాను కష్టపడి సాధించిన మెడల్స్‌ని అమ్మేయడానికి సిద్ధపడింది.
Samayam Telugu gujarat government to help poor athlete who decided to sell her medals
కాజల్‌కి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం


కుటుంబంలోని ఆరుగురిని పోషించడమే భారమైన కాజల్ తండ్రి ఓ సాధారణ కార్మికుడు కావడంతో అథ్లెటిక్స్‌లో 44 మెడల్స్ గెలుచుకున్న కాజల్‌ని చదివించేంత స్థోమత ఆ కుటుంబానికి లేకపోయింది. స్పీయర్, డిస్క్ థ్రో విభాగాల్లో జాతీయ స్థాయిలో 5, రాష్ట్ర స్థాయిలో 39 మెడల్స్ గెలుచుకున్న కాజల్‌కి వర్షాకాలం వస్తే ఇల్లు అంతా బురదమయం అయ్యే ఇంట్లో ఈ మెడల్స్ పెట్టుకునే చోటు కూడా కరువైంది.

ఈ కడు పేదరికంలో తన మెడల్స్‌ని అమ్మేయడానికి సిద్ధపడింది కాజల్. టైమ్స్ గ్రూప్‌కి చెందిన నవ్‌ గుజరాత్ సమయ్ కాజల్ దయనీయ గాథపై ఓ కథనాన్ని ప్రచురించడంతో ఆమె అసలు దుస్థితి వెలుగులోకొచ్చింది. దీంతో కాజల్ పేదరికం గురించి తెలుసుకున్న గుజరాత్ ప్రభుత్వం ఆమెకి ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధికారి ఒకరు కాజల్‌ని స్వయంగా కలిసి ఆమె పరిస్థితిని అడిగితెలుసుకుని.. కాజల్ చదువుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించనున్నట్టు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.