యాప్నగరం

డాన్స్ చేస్తున్న మహిళ.. చనిపోవడానికి 17 సెకన్లు పట్టలేదు, పెళ్లిలో విషాదం

Garba Dance: పెళ్లి వేడుకలో గార్భ డ్యాన్స్ చేస్తున్న మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలింది. 17 సెకన్లలో ప్రాణాలు గాల్లో కలిశాయి. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 12 Dec 2020, 10:02 pm
అంతా క్షణాల్లో జరిగిపోయింది. పెళ్లి ఇంట్లో అప్పటిదాకా సరదాగా డాన్స్ చేస్తున్న ఓ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలింది. ఆ తర్వాత 17 సెకన్లలోనే కన్నుమూసింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా విషాదం అలుముకుంది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి డాన్స్ చేస్తుంటే మురిపెంగా చూసిన ఆమె చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసుకోలేని స్థితిలో అమాయకంగా తల్లి పిలుపు కోసం ఎదురుచూడటం అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది.
Samayam Telugu గార్భ డ్యాన్స్ చేస్తున్న మహిళ
Woman playing garba suffers heart attack, dies within 17 seconds in Gujarat's Gandhinagar


గాంధీనగర్‌ జిల్లా రూపాల్ గ్రామానికి చెందిన కల్పనాబెన్‌ గాద్వి అనే 45 ఏళ్ల మహిళ తమ బంధువుల వివాహ వేడుకకు హాజరైంది. శుక్రవారం (డిసెంబర్ 11) రాత్రి బంధువులతో కలిసి వివాహ వేడుకలో గార్భ నృత్యం చేసింది. డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా గుడుపుతున్న కల్పనాబెన్ వద్దకు ఆమె కుమార్తె పరిగెత్తుకు వచ్చింది. దీంతో పాపను చేతుల్లోకి తీసుకున్న కల్పన ఆమెను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ దృశ్యాలు కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

డాన్స్‌ చేస్తున్న తోటి మహిళలు స్పందించే లోపే కల్పనాబెన్ కుప్పకూలి ప్రాణాలు విడిచింది. బంధువులు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగానే ఆమె చనిపోయినట్లు తెలిపారు. ఆమె ఆకస్మిక మరణం పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం నింపింది. మనిషి ప్రాణం తృణప్రాయం అని ఇందుకే అంటారేమో..!

Must Read: పెళ్లైన 10 రోజులకే భర్త మృతి.. కరోనా సోకిందా? మిస్టరీ!

Also Read: కాలేజీ విద్యార్థినిపై అఘాయిత్యం చేసి, భవనం పైనుంచి తోసేసి.. ఘోరం

Don't Miss: 50 ఏళ్ల తర్వాత తాళంచెవి వెనక్కి.. ఆలస్యానికి క్షమించండి! అమ్మ బాబోయ్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.