యాప్నగరం

సొంత రాష్ట్రంలో మోదీకి ఎదురుగాలి

గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం మారిపోతూ ఉత్కంఠం కలిగిస్తున్నాయి. తొలి రౌండ్‌లో పూర్తి ఆధిక్యత కనబరిచిన కమలం మూడో రౌండ్‌కు దిగివచ్చింది.

TNN 18 Dec 2017, 9:27 am
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన బీజేపీ, రెండు, మూడు రౌండ్లు ముగిసేసరికి కిందకు అమాంతం దిగివచ్చింది. గుజరాత్‌లో కాంగ్రెస్ నుంచి అధికార బీజేపీ గట్టి పోటీని ఎదుర్కోంటోంది. తొలి రౌండ్‌లో ఆధిక్యంలో ఉన్న సీఎం విజయ్ రూపానీ, మూడో రౌండ్ ముగిసేసరికి వెనుకబడ్డారు. తాజా ఫలితాల సరళి ప్రకారం, 182 స్థానాలున్న గుజరాత్ లో 182 స్థానాల సరళి వెలువడుతుండగా, బీజేపీ 89, కాంగ్రెస్ 90, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ లో 105 స్థానాల్లో ఆధిక్యం చూపిన బీజేపీ, రెండు, మూడు రౌండ్ల తరువాత 16 స్థానాల్లో వెనక్కు వెళ్లిపోయింది. క్షణక్షణం ఫలితాల సరళి మారడంతో ఏ వైపు మొగ్గు చూపిస్తాయోనన్న సర్వత్రా ఆసక్తిని నెలకొంది. మరోవైపు 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ లో 45 అసెంబ్లీ నియోజకవర్గాల సరళి తెలుస్తుండగా, బీజేపీ 30, కాంగ్రెస్ 12 చోట్ల ముందంజలో ఉంది.
Samayam Telugu gujrat elections 2017 congress leads 90 bjp in 87
సొంత రాష్ట్రంలో మోదీకి ఎదురుగాలి


గుజరాత్‌లో 182 స్థానాలకు డిసెంబరు 9, 14 తేదీల్లో పోలింగ్ నిర్వహించగా, గత నవంబరు 9 న హిమాచల్‌ప్రదేశ్‌లో 68 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. గుజరాత్ ఎన్నికలను ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తపోసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.