యాప్నగరం

జైల్లో డేరా బాబాకు అవన్నీ కట్!

తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసుల్లో దోషిగా తేలి రోహ్ తక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్ రామ్ రహీమ్

TNN 20 Sep 2017, 8:20 am
తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసుల్లో దోషిగా తేలి రోహ్ తక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ పరిస్థితి గురించి వివరించారు జైలు అధికారులు. జైల్లో గుర్మీత్ ను ఒంటరిగా ఉంచారనే విషయం అబద్ధమని వారు వివరించారు. గుర్మీత్ ఒంటరిగా లేడని.. అతడికి తోడు మరో ఇద్దరు జీవిత ఖైదీలు ఉన్నారని పేర్కొన్నారు.
Samayam Telugu gurmeet spend his time in jail growing vegetables
జైల్లో డేరా బాబాకు అవన్నీ కట్!


అలాగే జైల్లో గుర్మీత్ కు కాయగూరల చెట్ల పెంపక బాధ్యతలు అప్పగించినట్టుగా అధికారులు వివరించారు. ఈ పనికిగానూ గుర్మీత్ కు రోజుకు ఇరవై రూపాయల కూలీ దక్కుతుందన్నారు. ఎలాంటి నైపుణ్యం లేకపోవడం వల్ల గుర్మీత్ కు ఈ పనులు ఇచ్చినట్టుగా తెలిపారు. నైపుణ్యం లేని ఖైదీల పనికి రోజుకు ఇరవై రూపాయల కూలీ ఇవ్వాలనేది జైలు నియమం.

ఇక డేరా ఆశ్రమంలో సర్వసుఖాలూ అనుభవించిన గుర్మీత్ కు జైల్లో మాత్రం ఎలాంటి అదనపు సౌకర్యాలూ లేవు. ఇతడికి పేపర్, టీవీ వంటివేవీ అందుబాటులో లేకుండా చూశారు. అయితే చదువతానంటే పుస్తకాలను మాత్రం ఇస్తున్నారని తెలుస్తోంది. అలాగే జైల్లో కొంతమంది ఖైదీలకు ఫోన్ సౌకర్యం ఉంటుంది.. కానీ బాబాకు ఈ సౌకర్యాన్ని ఇవ్వలేదు. అతడు తన అనుచరులకు ఫోన్లు చేసి బయట అల్లర్లు రేపే అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో గుర్మీత్ కు ఫోన్ సౌకర్యం లేకుండా చేశారట అధికారులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.