యాప్నగరం

9 నెలల తర్వాత విడుదల కానున్న హార్దిక్

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన హార్దిక్ పటేల్‌ త్వరలోనే బెయిల్‌పై విడుదల కానున్నాడు.

TNN 12 Jul 2016, 2:10 pm
Samayam Telugu hardhik will release soon
9 నెలల తర్వాత విడుదల కానున్న హార్దిక్

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన హార్దిక్ పటేల్‌ త్వరలోనే బెయిల్‌పై విడుదల కానున్నాడు. రాజద్రోహం కేసులో అతడికి బెయిల్ ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు కొద్ది రోజుల క్రితం అంగీకరించింది. కానీ విసానగర్‌లో ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి కేసులోనూ నిందితుడిగా ఉండటంతో ఆయ జైళ్లోనే ఉండాల్సి వచ్చింది. తాజాగా ఈ కేసులోనూ బెయిల్ మంజూరు కావడంతో హార్దిక్ త్వరలోనే విడుదల కానున్నాడు. అయితే మూడు నెలలపాటు మెహసానా జిల్లాలోకి అడుగు పెట్టొద్దనే నిబంధనపై కోర్టు అతడికి జెయిల్ ఇచ్చింది. గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంలోనే హైకోర్టు అతడికి ఆర్నెల్లపాటు రాష్ట్ర బహిష్కరణ విధించింది. దీంతో జైలు నుంచి బయటకు రాగానే రాష్ట్రం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబర్ నుంచి జైళ్లోనే ఉంటున్న హార్దిక్ న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయితే ఒకటి రెండు రోజుల్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.