యాప్నగరం

రిలీజైన హార్థిక్ పటేల్‌.. ర్యాలీలో దొంగల చేతివాటం

గుజరాత్‌లో పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ కోటా డిమాండ్‌తో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసి పలు చోట్ల హింసాత్మక...

TNN 15 Jul 2016, 2:03 pm
గుజరాత్‌లో పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ కోటా డిమాండ్‌తో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసి పలు చోట్ల హింసాత్మక ఘటనలకి కారకుడయ్యాడనే నేరం కింద అరెస్ట్ అయిన హార్ధిక్ పటేల్ 9 నెలల తర్వాత ఇవాళ ఉదయం సూరత్‌లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గత వారమే అతడికి బెయిల్ మంజూరు చేసిన గుజరాత్ హైకోర్టు.. జైలు నుంచి రిలీజైన 48 గంటల్లోగా రాష్ట్రం విడిచిపెట్టడంతోపాటు మరో ఆరు నెలల వరకు రాష్ట్రాన్ని విడిచివెళ్లాలని షరతు విధించిన సంగతి తెలిసిందే.
ఇవాళ జైలు నుంచి విడుదలైన అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడిన హార్థిక్ పటేల్... 'పటేల్ వర్గానికి రిజర్వేషన్ కావాలనేది మాత్రమే తన డిమాండ్ కానీ 56 ఇంచుల ఛాతి కాదు' అని అన్నారు. 'పటేల్ సామాజిక వర్గం కోసం పోరాడుతూనే వుంటా. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి కూడా నేను సిద్ధమే' అని ఈ సందర్భంగా హార్థిక్ స్పష్టంచేశారు.
Samayam Telugu hardik patel patidar quota stir leader released from surat jail
రిలీజైన హార్థిక్ పటేల్‌.. ర్యాలీలో దొంగల చేతివాటం


ఇదిలావుంటే సూరత్‌లో హార్ధిక్ పటేల్ చేపట్టిన భారీ ర్యాలీలో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారి జేబులు కత్తిరించి వారి వద్ద వున్న పర్సులు, మొబైల్ ఫోన్లు కొట్టేశారు. దాదాపు 100 మంది వరకు జేబు దొంగల బాధితులు వుండగా వారిలో ర్యాలీకి హాజరైన ఎమ్మెల్యే నలిన్ కొటాడియా కూడా వున్నారు. ఈ చోరీలకి సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.