యాప్నగరం

హర్యానా ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

Haryana: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆయనే వెల్లడించారు. తనను కలిసిన వారందరూ ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు.

Samayam Telugu 24 Aug 2020, 8:20 pm
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరినీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. ‘ఈ రోజు నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. నాతో సన్నిహితంగా మెలిగిన వారు వెంటనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఖట్టర్ ట్వీట్ చేశారు.
Samayam Telugu మనోహర్ లాల్ ఖట్టర్
Manohar Lal Khattar Covid-19 Positive


ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. దేశంలో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులను కరోనా వణికిస్తోంది. హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ మహమ్మారి బారినపడి యూపీలో ఇద్దరు మంత్రులు మృతి చెందారు.

Also Read: కరోనా టీకా ఉత్పత్తిలో భారత్ సాయం కోరిన రష్యా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.