యాప్నగరం

ఇక నుంచి రైల్వే స్టేషన్లలో భారీ స్క్రీన్లు..

డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే స్టేషన్ల ఆధునికరణపై రైల్వేశాఖ దృష్టిసారించింది.

TNN 17 Oct 2016, 8:30 am
డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే స్టేషన్ల ఆధునికరణపై రైల్వేశాఖ దృష్టిసారించింది. ఈ చర్యలో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషనల్లో భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని దశల వారీగా అమలు చేయనున్నారు. తొలి దశలో దేశంలోనిప్రధాన నగరాలు, పట్టణాలతో సహా దాదాపు 2 వేల రైల్వే స్టేషన్లలో ఇవి ప్రత్యక్షం కానున్నాయి. రైళ్ల రాకపోకలు, ప్లాట్ ఫాం వివరాలతో పాటు...రిజర్వేషన్లు, సీట్ల వివరాలు తదితర సమాచారం ఈ స్రీన్‌లో ప్రదర్శించనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ మేరకు నిర్ణయిం తీసుకున్నట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన డిజిటల్ ఇండియా పిలుపు మేరకు దీన్ని అమలు చేస్తున్నామన్నారు.
Samayam Telugu heavy digital screens at indian railway stations
ఇక నుంచి రైల్వే స్టేషన్లలో భారీ స్క్రీన్లు..


ఆదాయమే లక్ష్యం...

రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయబోయే ఈ భారీ స్క్రీన్లలో అంతే భారీ మొత్తంలో ప్రకటనలు కనిపించనున్నాయి. రైల్వే ఆదాయం పెంచే చర్యలో భాగంగా ఇందులో ప్రకటనలకూ చోటు కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.