యాప్నగరం

తమిళనాడులో వర్ష బీభత్సం.. ఈ నెల 7న రెడ్ అలర్ట్

తమిళనాడులో భారీ వర్షాలు.. మూడు జిల్లాలను వణికిస్తున్న కుండపోత వానలు.. అక్టోబర్ 7న రెడ్ అలర్ట్...

Samayam Telugu 5 Oct 2018, 12:55 pm
తమిళనాడును వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెన్నైతో పాటూ మరికొన్ని జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వర్షం దెబ్బకు చెన్నైతో పాటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ వర్షాలతో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అంతేకాదు మూడు ప్రాంతాల్లో జనజీవనం కూడా స్తంభించింది.
Samayam Telugu Rains


మూడు జిల్లాలతో పాటూ పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, ధర్మపురి, శివగంగై, దిండుకల్‌, మదురై, నామక్కల్‌, తిరువారూర్‌ జిల్లాల్లో కూడా గురువారం భారీవర్షం పడింది. వేలూరు జిల్లాలో అరక్కోణం.. కాంచీపురం జిల్లాలో తిరుపోరూర్‌, కాంచీపురం, కల్పాక్కం, మహాబలిపురంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పెరియకుళం సమీపంలోని కుంభకరై జలపాతంలో వరద పోటెత్తింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 7న అతి భారీ వర్షం కురుస్తుందని.. తర్వాత మూడు రోజులు భారీ వర్షాలు పడతాయంటున్నారు అధికారులు. 7న దాదాపు 25 సెం.మీల వర్షపాతం నమోదు కావచ్చంటున్నారు. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. ముందస్తు జాగత్ర చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.