యాప్నగరం

ముంబైకి కొత్త పోలీస్ బాస్.. వస్తూనే వార్నింగ్!

Mumbai: ముంబై నగరానికి కొత్త పోలీస్ బాస్ వచ్చారు. ముఖేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కలకలం రేపిన ఘటనలో ముంబైలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Samayam Telugu 17 Mar 2021, 8:55 pm
దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త పోలీస్‌ బాస్ వచ్చారు. ముంబై పోలీస్ కీర్తి ప్రతిష్టలను తిరిగి సాధిస్తామని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో.. ఆయన స్థానంలో హేమంత్‌ నగ్రాలే కొత్త కమిషనర్‌గా బుధవారం (మార్చి 17) బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu హేమంత్ నగ్రాలే
Mumbai Police Boss


ప్రస్తుతం కొన్ని చెడు సంఘటనల కారణంగా ముంబై పోలీసుల ప్రతిష్ట మసకబారే పరిస్థితి తలెత్తిందని హేమంత్‌ అన్నారు. ముంబై పోలీసుల కీర్తి, ప్రతిష్టలను తిరిగి సాధిస్తామని పేర్కొన్నారు. ‘మేం చట్టం ప్రకారం వ్యవహరిస్తాం. అధికారులందరూ చట్టం ప్రకారం వారి విధులు నిర్వర్తించాలి’ అంటూ బాధ్యతలు చేపడుతూనే ఆయన హెచ్చరికలు చేశారు.

పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కలకలం రేపిస సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీస్ అధికారి సచిన్‌ వాజేకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ ఆయణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. ఫిబ్రవరి 25న అంబానీ ఇంటి ముందు వాహనాన్ని నిలిపి ఉంచినప్పుడు ఆయన అక్కడ ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు.

ఈ నాటకీయ పరిణామాల అనంతరం ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. హోంగార్డ్‌ డీజీగా ఆయనకు బాధ్యతలు అప్పగించింది. ఆయన స్థానంలో హేమంత్‌ నగ్రాలేను ముంబై పోలీస్ కమిషనర్‌గా నియమించగా.. వెంటనే ఆయన బాధ్యతలు చేపట్టారు.

Must Read:

దేశంలో ఎంతమంది కోటీశ్వరులున్నారో తెలుసా.. షాకవుతారు!

సెకండ్ వేవ్: ఇప్పుడే అడ్డుకోకపోతే.. ముఖ్యమంత్రులకు మోదీ సూచన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.