యాప్నగరం

యువకుడి లాకప్ డెత్.. పోలీస్ స్టేషన్‌కు నిప్పు

పోలీసుల కస్టడీలో ఉన్న 22 ఏళ్ల యువకుడి మరణం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. యువకుడి తరఫు బంధువులకు, పోలీసులకు మధ్య జరిగిన గొడవ యుద్ధాన్ని తలపించింది.

TNN 9 Feb 2018, 3:55 pm
పోలీసుల కస్టడీలో ఉన్న 22 ఏళ్ల యువకుడి మరణం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. యువకుడి తరఫు బంధువులకు, పోలీసులకు మధ్య జరిగిన గొడవ యుద్ధాన్ని తలపించింది. పెద్ద గుంపుగా వచ్చిన యువకుడి తరఫు మనుషులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీస్ స్టేషన్‌కు, స్టేషన్‌లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్‌పూర్ పట్టణంలో చోటుచేసుకుంది. తాజా పరిణామంతో సంబల్‌పూర్ పట్టణంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu high alert in sambalpur after police station set on fire 30 injured
యువకుడి లాకప్ డెత్.. పోలీస్ స్టేషన్‌కు నిప్పు


భాలుపాలికి చెందిన అబినాష్ ముండా అనే యువకుడిని దొంగతనం కేసులో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఐంతపల్లి పోలీస్టేషన్‌లో ఆ యువకుడిని ఉంచారు. అయితే పోలీసులు కస్టడీలో ఉన్న అబినాష్ చనిపోయాడనే వార్త శుక్రవారం ఉదయం బయటికొచ్చింది. దీంతో అతని బంధువులు, సన్నిహితులు అంతా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కావాలనే అబినాష్‌ను పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తూ దాడికి దిగారు. రాళ్లు రువ్వారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి ఫైళ్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. స్టేషన్ ఆవరణలో ఉన్న సీజ్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. అనంతరం స్టేషన్‌కూ నిప్పు పెట్టారు.

అనంతరం సంబల్‌పూర్-రౌర్కెలా రాష్ట్ర రహదారిని స్తంభింపజేశారు. రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేశారు. దీంతో వందల కొలది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఈ అల్లర్లలో 10 మంది పోలీసులు సహా 30 మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే, నిందితుడిని తాము కొట్టలేదని.. అతనే లాకప్‌లో ఉరివేసుకుని చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన ఒడిశా పోలీస్ శాఖ విచారణ చేపట్టింది. మానహక్కుల సంరక్షణ సెల్ దీనిపై విచారణ చేపట్టిందని ఐజీ సుశాంత్ నాథ్ వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు.

ఈ ఘటనకు బాధ్యులుని చేస్తూ ఐంతపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జ్ శ్రీమంత బారిక్‌ సహా ముగ్గురు పోలీసులను డీజీపీ ఆర్పీ శర్మ సస్పండ్ చేశారు. మరోవైపు అబినాష్ మృతిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అబినాష్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.