యాప్నగరం

Himachal pradesh: సామూహిక మత మార్పిడులపై కఠిన నిబంధనలు.. పదేళ్ల జైలు శిక్ష..!

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal pradesh) ప్రభుత్వం సామూహిక మత మార్పిడిపై కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. శనివారం అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదం పలికింది. దీని ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది ఒకేసారి మతం మార్చుకుంటే కఠిన శిక్షలు అమలు కానున్నాయి. మత మార్పిడికి పాల్పడిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడనుంది. అలాగే మతం మార్చుకున్న కుటుంబాలకు కూడా ప్రభుత్వం నుంచి అందే రాయితీలు, సబ్సిడీలపై కోత పడుతుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 14 Aug 2022, 2:35 pm

ప్రధానాంశాలు:

  • మత మార్పిడులను అరికట్టేందుకు చట్టం
  • బిల్లును ఆమోదించిన హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ
  • మత మార్పిడికి పాల్పడిన వారికి శిక్షలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Himachal Pradesh Assembly
Himachal pradesh: బలవంతపు మత మార్పిడులను కట్టడి చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు సామూహిక మత మార్పిడులను వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన బిల్లును హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ శనివారం ఆమోదం పలికింది. రాష్ట్ర సీఎం జైరామ్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వం శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై మత మార్పిడులపై ప్రభుత్వం కొరఢా ఝులిపించనుంది. ఈ చట్టం ప్రకారం ఒకేసారి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని మతం మార్పించిన వారికి పదేళ్ల జైలు శిక్ష పడుతుంది.
అంతేకాదు మతం మారిన వారి కుటుంబాలపై కూడా ప్రభావం పడనుంది. సదరు వ్యక్తుల తల్లిదండ్రుల కులం, మతానికి సంబంధించిన ప్రభుత్వ ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఇక ఉండదు. మతం మార్చుకోవాలనుకునే వాళ్లు ఆ మేరకు ముందుగానే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పాతచట్టమైన 2019 మత స్వేచ్ఛ చట్టంలో సామూహిక మత మార్పిడిని అరికట్టడానిక ఎటువంటి నిబంధనలు లేవని అందువల్లే ఈ చట్టాన్ని సవరించి రూపొందించామని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ చెప్పారు. ఆ చట్టంలో తీవ్రస్థాయిలో శిక్షలు లేవని ఆయన పేర్కొన్నారు.

అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలకు తెచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యాణా ప్రభుత్వాలు ఈ బిల్లుల్ని తీసుకొచ్చాయి. దేశంలో లవ్ జిహాదీ పేరుతో మత మార్పుడిలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని గతంలో బీజేపీ నేతలు కూడా బహిరంగంగానే చెప్పారు. ముఖ్యంగా ప్రేమ పేరుతో యువతుల్ని, మహిళలను ముస్లిం మతంలోకి మారుస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు.

మత మార్పిడికి సంబంధించిన బిల్లును కర్ణాటకలో మత స్వేచ్ఛ హక్కు పరిరక్షణ పేరుతో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లుకు శాసన మండలిలో ఆమోదం రాకపోవడంతో ఆర్డినెన్స్‌గా తీసుకు వచ్చారు. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మేలో ఆమోదం తెలిపారు. ఇక మధ్యప్రదేశ్‌తో మత మార్పిడి వ్యతిరేక బిల్లుగా, మతమార్పిడి వ్యతిరేక బిల్లుగా తీసుకొచ్చారు. అయితే ఒడిశాలో ఎప్పటి నుంచి అంటే 1967 నుంచే మత స్వేచ్ఛ పేరుతో మత మార్పిడి నిరోధక చట్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.