యాప్నగరం

హిజ్బుల్ తీవ్రవాది బుర్హన్ వనీ వారసుడి హతం

హిజ్బుల్ ముజయీదీన్ తీవ్రవాది బుర్హన్ వనీ వారసుడిగా పేర్కొంటున్న సబ్జర్ అహ్మాద్ అలియాస్ అబు జరర్ హతమయ్యాడు.

TNN 27 May 2017, 3:06 pm
హిజ్బుల్ ముజయీదీన్ తీవ్రవాది బుర్హన్ వనీ వారసుడిగా పేర్కొంటున్న సబ్జర్ అహ్మాద్ అలియాస్ అబు జరర్ హతమయ్యాడు. శుక్రవారం రాత్రి పోలీసుల కార్డన్ సెర్చ్ లో భాగంగా పుల్వామా జిల్లాలోని ట్రాల్ లోని ఓ ఇంటిపై దాడి చేయగా సబ్జర్ తో పాటు పాకిస్థాన్ కు చెందిన మరో ఉగ్రవాది ఉన్నారు. మిలటరీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ దాడి జరిగింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సబ్జర్ పోలీసులకు మధ్య భీకర కాల్పులు కొనసాగాయి. ఇవి మధ్యాహ్నం వరకూ కొనసాగాయి.
Samayam Telugu hizbul mujahideen terrorist burhan wanis successor sabzar ahmad killed
హిజ్బుల్ తీవ్రవాది బుర్హన్ వనీ వారసుడి హతం


ఈ ఆపరేషన్ లో 42వ రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ము కశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు.
ఈ ఎన్ కౌంటర్ సబ్జర్ తో పాటున్న పాకిస్థానీ హతమైనట్లు పోలీసులు తెలిపారు.

గతేడాది జులైలో సైనిక దళాలు బుర్హన్ వనీని హతమార్చడంతో సంవత్సర కాలంగా కశ్మీర్ లోయలో హింస కొనసాగింది. నోట్లరద్దు తర్వాత ఇక్కడ చాలా వరకు శాంతియుత వాతావరణం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.