యాప్నగరం

హోం మంత్రి అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Tripura: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. త్రిపుర రాజధాని అగర్తలాలోని ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని దారి మళ్లించి గువాహటిలో ల్యాండ్ చేశారు. గత రాత్రి దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న త్రిపురలో రెండు రథయాత్రలను ప్రారంభించి, అక్కడ జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 5 Jan 2023, 2:38 pm
హోం మంత్రి అమిత్‌ షా ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బుధవారం (జనవరి 4) రాత్రి కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దారి మళ్లించారు. త్రిపుర రాజధాని అగర్తలలోని మహారాజా బిర్‌ బిక్రమ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని గువాహటికి దారి మళ్లించి అక్కడి లోక్‌ప్రియ గోపినాథ్‌ బోర్డోలాయ్‌ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
Samayam Telugu amit shah
అమిత్ షా


షెడ్యూల్ ప్రకారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి అగర్తల వెళ్లాల్సి ఉంది. రాత్రి 10 గంటల సమయంలో ఆయన మహారాజా విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, దట్టమైన పొగమంచు కమ్ముకోవడం వల్ల అది సాధ్యపడలేదనిని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. ఉష్ణోగ్రత 3 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత ఇది. ఢిల్లీ వాసులు చలికి గజగజ వణుకుతూ ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు కమ్ముకుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇక.. త్రిపురలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నేడు రెండు రథయాత్రలను ప్రారంభించేందుకు అమిత్ షా ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.