యాప్నగరం

సీఏఏకు వ్యతిరేకంగా మరింతగా నిరసనలు చేయండి :అమిత్ షా

Lucknow: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌కు అమిత్ షా సవాలు విసిరారు. మంగళవారం లక్నోలో సీఏఏకు మద్దతుగా జరిగినన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 21 Jan 2020, 4:34 pm
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో మరింతగా నిరసనలు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. అంతేకానీ, ఎట్టిపరిస్థితుల్లోను సీఏఏను వెనక్కి తీసుకునేదే లేదని షా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌కు సవాలు విసిరారు. మంగళవారం లక్నోలో సీఏఏకు మద్దతుగా జరిగినన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu Amith Sha on Ram mandir


Also Read: పాఠశాలలోనే కుక్కకు ఇల్లు.. ఫైన్ల డబ్బుతో నిర్మించిన ప్రిన్సిపల్!

ఈ చట్టం ద్వారా దేశంలోని ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయబోం. కేవలం పౌరసత్వం ఇచ్చేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు స్వ ప్రయోజనాల కోసం అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకారులకు కూడా నేను ఒకటే చెబుతున్నా. మీరు మీ ఆందోళనలు మరింతగా చేసుకున్నా సరే.. మేం మాత్రం సీఏఏని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. రాహుల్, అఖిలేశ్, మాయావతి, మమత వంటి సీఏఏను వ్యతిరేకించే వారందరికీ ఇదే నా సవాలు. దేశంలో ఎక్కడైనా సీఏఏపై బహిరంగ చర్చకు నేను ఆహ్వానిస్తున్నా.’’ అని సవాలు విసిరారు.

Also Read: మంత్రి మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. బర్తరఫ్‌కు డిమాండ్

ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. పాకిస్థాన్ నుంచి ఎన్నో ఏళ్లుగా అక్రమ వలసదారులు, ఉగ్రవాదులు వస్తూ భారత్‌లో బాంబులు వేస్తుంటే మన్మోహన్ సింగ్ ఒక మౌనమునిలా ఉండిపోయారని ఎద్దేవా చేశారు. ఇంకా కాంగ్రెస్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ లక్నోలో ముస్లింలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో అక్కడే సీఏఏపై అనుకూల ర్యాలీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: మరింత శక్తిమంతంగా ‘సామజవరగమనా..’: కేటీఆర్ కామెంట్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.