యాప్నగరం

కొంపముంచిన క్రాకర్స్.. వరుడితో గుర్రం పరుగు

ఓ పెళ్లిలో జరిగిన ఫన్సీ ఇన్సిడెంట్‌ నెట్టింట్లో వైరల్ అవుతుంది. బాంబుల మోతలకు భయపడి ఓ గుర్రం పైన కూర్చోన్న వరుడితో సహా పరుగులు తీసింది. ఆ పరిణామంతో అందరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఆ గుర్రానికి సంబంధించిన వ్యక్తి మాత్రం దాని వెనుక పరుగెత్తినా.. దాని స్పీడ్‌ను అందుకోలేకపోయాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 14 May 2022, 10:20 pm
ఈ మధ్య పెళ్లిళ్లే హాట్ టాపిక్‌ అయ్యాయి. వివాహ వేదికలపై జరుగుతున్న సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. ఒకప్పుడు అట్టహాసంగా పెళ్లిళ్లు జరిగితే అందరూ గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఆ పెళ్లి తంతుల్లో జరుగుతున్న ఫన్నీ సంఘటనలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లి తంతు వార్తల్లో నిలిచింది. పటాకుల కాల్చడంతో భయపడిన గుర్రం, పైన కూర్చొన్న పెళ్లి కుమారుడితో సహా అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ గుర్రం వేగాన్ని ఎవరూ అందుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Samayam Telugu గుర్రంపై పెళ్లికొడుకు


సాధారణంగా పెళ్లి కొడుకును గుర్రంపై కూర్చొబెట్టి ఊరేగిస్తుంటారు. అలా ఓ వరుడిని గుర్రంపై కూర్చొబెట్టి.. పూజలు నిర్వహించారు. మరోవైపు బంధుగణం మేళాతాళాలు, క్రాకర్స్‌ను పేల్చడంతో సందడి చేశారు. ఆ శబ్ధాలకి గుర్రం భయపడింది. అప్పుడే కరెక్ట్‌గా గుర్రం ముందే క్రాకర్స్‌‌ను కాల్చడంతో ఇక అక్కడ నుంచి పరుగులు తీసింది. దానిపైనే పెళ్లి కుమారుడు కూర్చొని ఉన్నాడు.. దాంతో గుర్రానికి చెందిన వ్యక్తి కూడా ఆ గుర్రం వెనుక పరుగులు తీశాడు.

View this post on Instagram A post shared by memes | comedy (@ghantaa)

ఈ ఊహించని పరిణామానికి పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు షాక్ అయ్యారు. అందరూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఆ వీడియోను గంటా అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకూ 40 లక్షల మందికిపై వీడియోను చూశారు. చూసిన నెటిజన్లు దీనిపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అయితే వివాహాల్లో గుర్రాలను ఉపయోగించడం కొత్త కాదు. కానీ బ్యాండ్ మేళాలు, టపాలకు మోతలకు అవి బెదిరిపోతుంటాయి. కానీ వాటిని ప్రజలు పట్టించుకోరు. వాటిని తరచుగా ఉపయోగిస్తుంటారు. దీంతో గుర్రాన్ని ఉపయోగించే పద్ధతి చాలా అనాగరికరమైనదనే వాదనలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.