యాప్నగరం

బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టిన 29 ఏళ్ల యువకుడు

బుధవారం వెల్లడైన యూపీలోని గోరఖ్‌పూర్ పార్లమెంటు ఉప-ఎన్నిక ఫలితం గురించే దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

TNN 15 Mar 2018, 12:06 pm
బుధవారం వెల్లడైన యూపీలోని గోరఖ్‌పూర్ పార్లమెంటు ఉప-ఎన్నిక ఫలితం గురించే దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. గత 29 ఏళ్ల నుంచి బీజేపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ 29 ఏళ్ల యువకుడు విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రఖ్యాత గోరఖ్‌నాథ్ మఠం, నాథ్‌లకు మతపరమైన కేంద్రం... ఇలాంటి చోట బీజేపీ అభ్యర్థిని ఓడించడం సాధారణ విషయం కాదు. టెంపుల్ సిటీలో బీజేపీ ప్రాభవానికి ఎదురునిలిచి ప్రవీణ్ నిషద్ విజయం సాధించారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ప్రవీణ నిషాద్ గురించి నియోజకవర్గ ప్రజలకు తెలియదు. కానీ, మార్పును కోరుకున్న ప్రజలు అతడికి పట్టం కట్టారు. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇదే స్థానంలో 1998 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు గెలుపొందారు.
Samayam Telugu how 29 year old praveen kumar nishad shook off 29 year hold of bjp in gorakhpur
బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టిన 29 ఏళ్ల యువకుడు


అలాంటి చోట ముక్కు మొహం తెలియని ఓ అభ్యర్థి గెలుపు కమలనాథులనే కాదు మిగతా పార్టీలను విస్మయానికి గురిచేసింది. అంతెందుకు సమాజ్‌వాదీ పార్టీకే నమ్మశక్యంగా లేదు. 29 ఏళ్ల తర్వాత ఈ స్థానం బీజేపీ నుంచి చేజారిపోవడంతో 29 ఏళ్ల ప్రవీణ్ నిషద్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. లక్నోలోని గౌతమ్‌బుద్ధ యూనివర్సిటీ నుంచి 2011లో ఇంజినీరింగ్ డిగ్రీ పుచ్చుకున్న ప్రవీణ్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఎన్నికల అఫిడ్‌విట్‌లో అతడి పేరుతో కేవలం రూ.11 లక్షల విలువైన ఆస్తులు, బ్యాంకు రుణం 99 వేలు ఉన్నట్టు తెలిపారు. ప్రవీణ భార్య ప్రభుత్వద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీటితోపాటు బీఎస్పీ తన ఓట్లను ఎస్పీకి విజయవంతంగా బదలాయించడంలో ప్రవీణ విజయం సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.