యాప్నగరం

పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం చర్యలు

పరిశ్రమల ఏర్పాటు, ప్రభుత్వ అభివృద్ధిపనుల్లో జాప్యం లేకుండా వుండేందుకు గడిచిన 20 నెలల్లో పర్యావరణం, అటవీ శాఖ అనేక చర్యలు చేపట్టింది.

Maharashtra Times 4 Apr 2016, 9:17 pm
పరిశ్రమల ఏర్పాటు, ప్రభుత్వ అభివృద్ధిపనుల్లో జాప్యం లేకుండా వుండేందుకు గడిచిన 20 నెలల్లో పర్యావరణం, అటవీ శాఖ అనేక చర్యలు చేపట్టింది. అందులో ముఖ్యమైనవి కొన్ని ఇలా వున్నాయి.
Samayam Telugu how environment ministry has brought changed in doing business
పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం చర్యలు


* గతంలో పర్యావరణ అనుమతుల జారీకి పట్టే అధిక సగటు కాల వ్యవధి 599 రోజులుగా వుండేది. ఇప్పుడు దానిని 192 రోజులకి తగ్గించారు. ఇక అటవీ శాఖ నుంచి వచ్చే అనుమతులకి గతంలో సగటున 430 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఈ పని 170 రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు.

* అటవీ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఓ వెబ్ పోర్టల్ లాంచ్ చేశారు. ఇక్కడే తమ ప్రపోజల్ స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటుని కల్పించింది కేంద్రం.

* కాంప్రెహెన్సివ్ ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్(సీఈపీఐ) ఫార్ములాని సవరించి మరింత ప్రయోజనం కలిగేలా చేశారు.

* కాలుష్య తీవ్రతని బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ పేరిట పరిశ్రమల కేటగిరీల ఏర్పాటు.

* వైట్ కేటగిరీ పరిశ్రమల ఏర్పాటుకి అనుమతుల జారీ అవసరం లేకుండా చేశారు. స్టార్టప్ పరిశ్రమలు కూడా కొన్ని ఈ కేటగిరీ పరిధిలోకి వస్తాయి.

* చెట్ల నరికివేత వంటి పనులకి అవసరమయ్యే అనుమతుల జారీకి సంబంధించిన అధికారాలని రాష్ర్ట ప్రభుత్వాలకే కల్పించడం.

* రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలని దృష్టిలో వుంచుకుని అటవీ ప్రాంతాల్లో పెట్రోలు పంప్‌ల ఏర్పాటు మార్గదర్శకాలు హేతుబద్ధంగా వుండేలా చర్యలు.

* ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980ని అనుసరించి ఫారెస్ట్ భూముల్లోంచి రెండు లేన్ల రోడ్డు విస్తరణ, అభివృద్ధికి అవసరమయ్యే అనుమతుల జారీ.

మహారాష్ట్ర టైమ్స్ వారి సౌజన్యంతో..
http://maharashtratimes.indiatimes.com/nation/how-environment-ministry-has-improved-ease-of-doing-business/articleshow/51681444.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.