యాప్నగరం

సర్వే: రజనీకి వచ్చే సీట్లు ఎన్నంటే

రజనీ ప్రభావం ఎంత? తమిళనాడు రాజకీయాలపై రజనీ ఎంత ప్రభావాన్ని చూపుతాడు?

TNN 18 Jan 2018, 2:22 pm
రాజకీయ పార్టీని స్థాపిస్తాను అని ఇప్పటికే ప్రకటించేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే పార్టీ పేరు, ఇతర వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ విషయంలో కాస్త స్లోగానే అగుపిస్తున్నాడు సూపర్ స్టార్. ఇలాంటి నేపథ్యంలో రజనీ ప్రభావం ఎంత? తమిళనాడు రాజకీయాలపై రజనీ ఎంత ప్రభావాన్ని చూపుతాడు? అనేది మాత్రం అందరికీ ఆసక్తిదాయకమైన అంశమే. రజనీ పార్టీ పేరు ప్రకటించకపోయినా.. దీనిపై గట్టి చర్చే జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇదే అంశంపై ఒక వార్తా సంస్థ అధ్యయనాన్ని నిర్వహించింది. తమిళనాడులో రజనీకాంత్ ప్రభావాన్ని అంచనా వేయడానికి సర్వేను చేసింది.
Samayam Telugu how many seats can rajinikanth party win in tn
సర్వే: రజనీకి వచ్చే సీట్లు ఎన్నంటే


ఇందులో తేలింది ఏమిటంటే.. రజనీకాంత్ ప్రభావం తమిళనాట అంతగా ఉండదు అనేది. రజనీ రాజకీయాల్లోకి వస్తే ఆయన సీఎం అయిపోతాడు అని అభిమానులు అంటున్నారు కానీ.. సూపర్ రాజకీయాల్లోకి వచ్చినా.. కనీసం ఆయన ప్రతిపక్ష స్థానానికి కూడా రాలేడని ఈ సర్వే చెబుతోంది. తమిళనాట మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి ఎన్నికలు జరిగితే.. మెజారిటీ సీట్లను ప్రధాన ప్రతిపక్ష కూటమే సొంతం చేసుకుంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. డీఎంకే, కాంగ్రెస్, వాటికి అనుబంధంగా ఉన్న చోటామోటా పార్టీలు కలిసి కనీసం 130 సీట్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తప్పదని ఆ పార్టీ కేవలం 68 స్థానాలకు పరిమితం కాగలదని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇక రజనీ సంగతేంటి? అంటే.. సూపర్ స్టార్ గరిష్టంగా 33 సీట్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని ఈ అధ్యయనం అంచనా వేసింది.

అన్ని తక్కువ సీట్లు వస్తే.. రజనీకాంత్ కు సీఎం పీఠం దక్కదని వేరే చెప్పనక్కర్లేదు. అయితే పరిస్థితులు ఇలాగే ఉండవని.. రజనీ జనాల మధ్యకు వస్తే పరిస్థితులు మారతాయని అభిమానులు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.