యాప్నగరం

శశికళకు భయపడేది లేదంటున్న దీపా

జయలలిత మేనకోడలు దీప తన రాజకీయ ప్రవేశంపై మీడియాతో మాట్లాడారు.

TNN 7 Feb 2017, 6:38 pm
జయలలిత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తమిళనాడులో రోజుకో మలుపు చోటు చేసుకుంటోంది. ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ తమిళనాడు సీఎంగా సింహాసనం ఎక్కేందుకు అంతా సిద్ధం చేసుకున్నాక ఊహించని పరిస్థితుల్లో ఆ కార్యక్రమం వాయిదా పడింది. లేకుంటే ఈ పాటికి శశికళ సీఎం అయ్యి కొన్ని గంటలయ్యేది. కాగా జయలలిత మేనకోడుల దీపా జయకుమార్ మళ్లీ తన రాజకీయ రంగప్రవేశాన్ని గురించి మంగళవారం మధ్యాహ్నం మాట్లాడారు. శశికళ అంటే తనకేం భయం లేదని చెప్పారు. తప్పకుండా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే శశికళ మీదే పోటీకి నిలువ వలసిన అవసరం లేదని అన్నారు.
Samayam Telugu i am not afraid of sasikala jayalalithaas niece deepa says
శశికళకు భయపడేది లేదంటున్న దీపా


ఆమె టీ నగర్ లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ఆదివారం శశికళ అన్నా డీఎంకే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యాక తనకి అనేక ఫోన్ లు వచ్చాయని చెప్పారు. తాను తప్పక కొత్త పార్టీ పెడతానని, అన్ని వివరాలు అమ్మ జన్మదినమైన ఫిబ్రవరి 24న చెబుతానని తెలిపారు. శశికళ అన్నాడీఎంకే పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నికవడం తమిళనాడు చరిత్రలోనే ఓ దుర్దినమని తెలిపారు. ఆమె సీఎం అయితే రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి నెలకొంటుందన్నారు.

జయలలిత అనారోగ్యం, మృతిపై వైద్యులు చెప్పిన వివరాలు తనకు సంతృప్తికరంగా లేవన్నారు. తన మేనత్త (జయ) కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని, మరే ఇతర వ్యక్తిగత కారణాలు లేవని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.