యాప్నగరం

‘ఐ లవ్ యూ మోదీ’ అంటున్న మోషే!

26/11 ఉగ్రదాడుల నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇజ్రాయెల్ చిన్నారి మోషే.. ‘ఐ లవ్ యూ మోదీ’..

TNN 5 Jul 2017, 7:38 pm
26/11 ఉగ్రదాడుల నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇజ్రాయెల్ చిన్నారి మోషే.. ‘ఐ లవ్ యూ మోదీ’ అంటున్నాడు. 2008 న‌వంబ‌ర్ 26న ముంబైలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో మోషే తన కన్నవాళ్లను కోల్పోయాడు. నారీమ‌న్ సమీపంలోని యూదు సెంట‌ర్‌లో జ‌రిగిన దాడిలో మోషే తల్లిదండ్రులు మృత్యువాత‌ ప‌డ్డారు. అప్పుడు ఆ బాలుడి వ‌య‌సు రెండేళ్లు. ఇప్పుడు అత‌డికి పదకొండేళ్లు. ఇజ్రాయ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోదీ బుధవారం (జులై 5) మోషే హెల్ట్జ్‌బెర్గ్ ఇంటికి వెళ్లారు. భారత ప్రధానిని చూడగానే మోషే ఆనందంతో ఓ గ్రీటింగ్ పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ గ్రీటింగ్‌పై రాసి ఉన్న ‘ఐ ల‌వ్ యూ మోదీ, ఐ ల‌వ్ ఇండియా’ అనే వాక్యాలను చూసి మోదీ చలించిపోయారు. ఆప్యాయంగా ఆ పసివాణ్ని దగ్గరకు తీసుకున్నారు. త‌న గ్రాండ్ పేరెంట్స్‌తో పాటు భార‌త్‌కు రావాల‌ని మోషేను మోదీ ఆహ్వానించారు.
Samayam Telugu 11 child survivor moshe to pm modi
‘ఐ లవ్ యూ మోదీ’ అంటున్న మోషే!

PM Modi meets Moshe Holtzberg, the now 11-year-old survivor of the 26/11 attacks, in Jerusalem; PM Modi asks him to visit India with family pic.twitter.com/2NPD6sjwiH — ANI (@ANI_news) July 5, 2017
Jerusalem: Dear Mr Modi, I love you and your people in India says Moshe Holtzberg the now 11-year-old survivor of the 26/11 attacks pic.twitter.com/5X7lVrYCSs — ANI (@ANI_news) July 5, 2017
ఉగ్ర‌ దాడుల సమయంలో మోషే తల్లిదండ్రుల ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న సాండ్రా సామ్యూల్ అనే మ‌హిళ ఆ చిన్నారిని ప్రాణాల‌కు తెగించి కాపాడింది. ఆ త‌ర్వాత మోషేను అతడి గ్రాండ్ పేరెంట్స్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లింది. భారత ప్ర‌ధాని త‌మ‌ మ‌న‌వ‌డిని క‌లిసేందుకు వ‌చ్చినందుకు మోషే గ్రాండ్ పేరెంట్స్‌ సంతోషం వ్య‌క్తం చేశారు.

భారతీయులు తమ భాదను ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు ఆ వృద్ధ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. మోషే మళ్లీ ఇండియాకు వెళ్లడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నాడని, తన 13వ ఏట అతడు తప్పకుండా ఇండియాకు వస్తాడని వాళ్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.