యాప్నగరం

హెల్త్ మినిస్టర్, శరత్ కుమార్ ఇళ్లలో ఐటీ సోదాలు

తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సి విజయభాస్కర్‌తోపాటు సినీనటుడు శరత్ కుమార్ ఇంట్లో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు

TNN 7 Apr 2017, 11:11 am
తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సి విజయభాస్కర్ ఇంట్లో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు చేపట్టారు. ఈ నెల 12న ఆర్కే నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి విజయ భాస్కర్ నియోజకవర్గ ఓటర్లకి డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలపై ఐటీ శాఖ ఈ దాడులు చేపట్టింది. చెన్నైలోని విజయభాస్కర్ ఇంటితోపాటు చెన్నై, ఇతర జిల్లాల్లో వున్న అతడి బంధువుల ఇళ్లపై ఐటీ ఈ సోదాలు నిర్వహిస్తోంది.
Samayam Telugu i t officials raids houses of tn health minister vijayabaskar actor sarathkumar
హెల్త్ మినిస్టర్, శరత్ కుమార్ ఇళ్లలో ఐటీ సోదాలు


సినీనటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పార్టీ(ఏఐఎస్ఎంకే) నేత శరత్ కుమార్, ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిట్లపక్కం రాజేంద్రన్, డా ఎంజీఆర్ మెడికల్ యూనివర్శిటీ వీసీ ఎస్ గీతాలక్ష్మీ ఇళ్లలో కూడా ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిన్న ఏఐఎడీఎంకే ఆర్కే నగర్ అభ్యర్థి అయిన టీటీవీ ధినకరణ్‌ని కలిసిన శరత్ కుమార్ అతడికి తన మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే.

మంత్రి విజయభాస్కర్ ఓటర్లకి నోట్లు పంచిపెడుతున్నట్టుగా ఇటీవలి కాలంలో తమకి చాలా ఫిర్యాదులు అందాయని, అందుకే అతడితోపాటి అతడి బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నామని ఐటీ డిపార్ట్‌మెంట్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన ఓ సీనియర్ ఆఫీసర్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. మంత్రి విజయ భాస్కర్ ఇంట్లో సోదాలు చేపడుతున్న ఐటీ అధికారులకి నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు సెక్యురిటీ అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.