యాప్నగరం

పిల్లల్నికనడం ఆపొద్దని నాభార్యకు చెప్పా:ఎమ్మెల్యే

జనాభా నియంత్రణ చట్టం వచ్చేంత వరకు ఆపకుండా పిల్లల్ని కంటూనే ఉండాలని తాను తన భార్యను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

TNN 24 Feb 2018, 2:44 pm
వివాదాస్పద, సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలను మించిన వాళ్లు లేరు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే 'విక్రం సైనీ ' ముజఫర్‌నగర్ బహిరంగసభలో విస్తుగొలిపే వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ చట్టం వచ్చేంత వరకు ఆపకుండా పిల్లల్ని కంటూనే ఉండాలని తాను తన భార్యను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
Samayam Telugu i told my wife to keep producing children up bjp mla
పిల్లల్నికనడం ఆపొద్దని నాభార్యకు చెప్పా:ఎమ్మెల్యే


హిందువులంతా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటూ ఉంటే మిగతా మతస్థులు మాత్రం ఇద్దరి కంటె ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని అన్నారు. తద్వారా భవిష్యత్తులో హిందువులు మైనారిటీలోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. హిందుస్థాన్ హిందువుల దేశమని అన్నారు. ముస్లింలు అంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలని అన్నారు.

ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సైనీకి కొత్తకాదు. జనవరి 1న నిర్వహించే నూతన సంవత్సర వేడుకలను హిందువులు బహిష్కరించాలని గతంలో పిలుపునిచ్చారు. జనవరి 1 క్రిస్టియన్ల పండగని అన్నారు. వాలెంటైన్స్ డే కూడా క్రిస్టియన్ల పండుగ కాబట్టి హిందులు అంతా సామూహికంగా ఈ వేడుకలను బహిష్కరించాలని గతంలో పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.