యాప్నగరం

సారీ చెప్పను... దమ్ముంటే అరెస్టు చేయండి

ఎయిరిండియా సీనియర్ ఉద్యోగిపై అమానుషంగా ప్రవర్తించిన శివసేన ఎంపీకి ఇంకా తాను చేసిన పని పట్ల పశ్చాత్తాపం కలగడం లేదు.

TNN 25 Mar 2017, 8:08 am
ఎయిరిండియా సీనియర్ ఉద్యోగిపై అమానుషంగా ప్రవర్తించిన శివసేన ఎంపీకి ఇంకా తాను చేసిన పని పట్ల పశ్చాత్తాపం కలగడం లేదు. సర్వత్రా తీవ్ర విమర్శలు రేగుతున్నా కూడా అతను తన చర్యను మళ్లీ సమర్థించుకున్నాడు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా సీనియర్ ఉద్యోగినిన చెప్పుతో పదేపదే కొట్టిన సంగతి తెలిసిందే. తనకు బిజినెస్ క్లాస్ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతోనే ఆయన ఎయిరిండియా సీనియర్ మేనేజర్ సుకుమార్ ను కోపంతో ఊగిపోతూ తన చెప్పుతో కొట్టాడు. అంతేకాదు కొట్టిన సంగతిని తానే ఒప్పుకున్నాడు కూడా. మీడియాతో మాట్లాడుతూ... తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఆ ఉద్యోగే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఎంపీలతో ఎలా ప్రవర్తించాలో ఆ 60ఏళ్ల ఉద్యోగికి తెలిసి ఉండాలంటూ వ్యాఖ్యానించాడు. దమ్ముంటే పోలీసులు తనను అరెస్టు చేయాలని సవాల్ కూడా విసిరాడు. తన పార్టీ శివసేన తనకు అండగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
Samayam Telugu i will not apologise ravindra gaikwad shiv sena mp who beat 60 year old ai staffer
సారీ చెప్పను... దమ్ముంటే అరెస్టు చేయండి


ఎదుటిమనిషితో ఎలా ప్రవర్తించాలో తెలియని ఈ ఎంపీని ఎయిరిండియా నిషేధిత జాబితాలో పెట్టింది. అలాగే విమానయాన సంస్థల సమాఖ్య కూడా గైక్వాడ్‌ను నిషేధించినట్టు తెలుస్తోంది. కాగా ఒక ఎంపీ అలా ప్రవర్తించడంపై లోక్ సభలోనూ చర్చగా మారింది. లోక్ సభ స్పీకర్ తాను ఏవిధంగా చర్య తీసుకోవచ్చో... న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. పార్లమెంటు లోపల జరిగే వాటిపై తాను చర్యలు తీసుకోవచ్చు కానీ, పార్లమెంటు బయట జరిగే వాటిపై తాను ఎలా స్పందించాలన్న దానిపై స్పీకర్ వివరాలు తెలుసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.