యాప్నగరం

ఎయిర్ ఫోర్స్ విమానం మిస్సింగ్.. 13 మంది దుర్మరణం?

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం సోమవారం ఆచూకీ లేకుండా పోయింది. అసోంలోని జొర్హాట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన అరగంటకు గ్రౌండ్ ఏజెన్సీలతో సంబంధాలు తెగిపోయాయి.

Samayam Telugu 3 Jun 2019, 9:49 pm
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 రవాణా విమానం సోమవారం ఆచూకీ లేకుండా పోయింది. అసోంలోని జొర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన విమానం మధ్యాహ్నం 12.27 గంటలకు జొర్హాట్ నుంచి అరుణాచల్‌లోని మెంచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు బయల్దేరింది. ఆ సమయంలో విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి విమానానికి గ్రౌండ్ ఏజెన్సీలతో సంబంధాలు తెగిపోయాయి.
Samayam Telugu an 32


ఆచూకీ లేకుండా పోయిన విమానం విషయమై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ రాకేశ్ సింగ్‌తో ఆయన మాట్లాడారు.
ఏసీ-130 హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్, ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్, రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు తప్పిపోయిన విమానం ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. సుఖోయ్-30 యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగాయి. ఆర్మీ కూడా గాలింపు చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకూ విమాన శిథిలాలు లభ్యం కాలేదు. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాకు జిల్లాలోని టాటోకు ప్రాంతంలో విమానం కూలిపోయిందని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.