యాప్నగరం

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధవిమానం

జోధ్‌పూర్ ప్రాంతంలో కూలిన యుద్ధ విమానం. విమానం కూలిపోవడానికి వెనక గల కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై కోర్ట్ ఆఫ్ ఇంక్వయిరీకి ఆదేశించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది.

Samayam Telugu 4 Sep 2018, 12:26 pm
భారత వైమానిక దళం (ఐఎఎఫ్) మిగ్-27 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి రాజస్థాన్‌లో జోధ్‌పూర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ కందపాల్ సురక్షితంగా బయటపడగలిగారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ పెద్ద శబ్ధం చేస్తూ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఒక వాహనంతోపాటు రెండు ఇండ్లు ధ్వంసమయ్యాయి. విమానం కూలిపోవడానికి వెనక గల కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై 'కోర్ట్ ఆఫ్ ఇంక్వయిరీ'కి ఆదేశించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది.
Samayam Telugu mig


మిగ్ విమానాలు ప్రమాదానికి గురవడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది నవంబరులోనూ ఇదే రకానికి చెందిన విమానం జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. ల్యాండిగ్ గేర్‌లో సమస్యల వల్ల ఎయిర్‌పోర్ట్ రన్‌వే పైనే ఉండిపోయింది. అంతకుముందు 2015 జనవరిలోనూ..జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లోనే మరొక మిగ్-27 ఫైటర్ జెట్ విమానం బర్మర్ ప్రాంతంలో కూలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.