యాప్నగరం

వాళ్లు గెడ్డాలు పెంచొద్దు: సుప్రీంకోర్టు

ఇండియర్ ఎయిర్ ఫోర్స్ (భారత వాయు సేన-ఐఏఎఫ్)లో పనిచేసే ఉద్యోగులు మత ప్రాతిపదికన గెడ్డాలు పెంచాడనికి వీల్లేదని

TNN 15 Dec 2016, 3:36 pm
ఇండియర్ ఎయిర్ ఫోర్స్ (భారత వాయు సేన-ఐఏఎఫ్)లో పనిచేసే ఉద్యోగులు మత ప్రాతిపదికన గెడ్డాలు పెంచాడనికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గెడ్డాలు పెంచుకోవడంపై ఆజ్ఞలు విధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని తేల్చి చెప్పింది.
Samayam Telugu iaf personnel cannot sport beard says supreme court
వాళ్లు గెడ్డాలు పెంచొద్దు: సుప్రీంకోర్టు


గురువారం సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ డివై జయచంద్రచుద్, ఎల్.నాగేశ్వరారావులతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై కీలక తీర్పును వెలువరించింది.

ఇద్దరు ఐఏఎఫ్ ఉద్యోగులు మహ్మాద్ జుబీర్, అన్సారీ ఆఫ్తాబ్‌లు గెడ్డాలు పెంచుకోవద్దని పై అధికారులు 2003లో జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని వారు కోర్టులో వాదించారు. వారి అభ్యర్థనను ఢి హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో...సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

లౌకికవాద దేశంలో ఒక మతప్రాతిపదికన విశ్వాసాలు పాటించడం వాయుసేనకు కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కులం, మతం, వర్గం, లింగ, జాతి వైషమ్యాలను ఎయిర్ ఫోర్స్ పాటించదని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.