యాప్నగరం

అమరవీరుడి కూతుర్ని ‘దత్తత’ తీసుకుంటాం

హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లులో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న యూనస్ ఖాన్, ఆయన సతీమణి ఐపీఎస్ అంజుమ్ అరలు

TNN 5 May 2017, 12:38 pm
హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లులో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న యూనస్ ఖాన్, ఆయన సతీమణి ఐపీఎస్ అంజుమ్ అరలు అమరవీరుడు పరమ్ జిత్ కూతురు కుష్ దీప్ కౌర్ ను చదివించేందుకు ముందుకొచ్చారు. ఆమె చదువు, పెళ్లికయ్యే ఖర్చులు తామే భరిస్తామని ఈ యువ జంట చెబుతోంది.
Samayam Telugu ias ips couple to look after martyr paramjit singhs daughter
అమరవీరుడి కూతుర్ని ‘దత్తత’ తీసుకుంటాం


‘కుష్ దీప్ కౌర్ ఆమె కుటుంబ సభ్యులతోనే గడపవచ్చు. ఆమెకు ఏలాంటి అవసరం వచ్చిన మేం సాయం చేస్తాం. ఆమెకు ఏ సమస్య వచ్చినా ముందుంటాం. ఆమె ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకున్నా..ఇంకా ఏ కెరీర్ ఎంచుకున్నా అందులో స్థిరపడేందుకు మా వంతుగా కృషి చేస్తాం. ఇది అమరవీరుడు పరమజిత్ కు మేం ఇచ్చే నివాళి’ అంటున్నారు సోలన్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న అంజుమ్ అర.

అమరవీరుడి కుటుంబానికి అండగా ఉండటం తమ కనీస బాధ్యతగా ఫీలవుతున్నామని యూనస్ చెబుతున్నారు. కుష్ దీప్ ఏ స్కూల్లో చదివినా ఆ ఖర్చంతా తామే భరిస్తామని ఆయన అంటున్నారు. ‘ఆమెకు జీవితాంతం అండగా ఉండాలని నిర్ణయించుకున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.